BIG SCAM : చచ్చిన శవాలతో భారీ స్కామ్.. లక్షల్లో వసూలు చేస్తూ ఎంతకు తెగించారో తెలుసా?

మనిషి మనిషిగా కాకుండా భగవంతుడిగా మారాలని అరటపడుతున్నాడు. ఎప్పటికీ చిరంజీవిగా : ఉండాలని.. చనిపోకూడదని ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నాడు. హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ నుంచి బ్రెయిన్ వరకు.. ఇలా ప్రతీ అవయవాన్ని రీప్లేస్ చేస్తూ.. అమరుడు అయిపోవాలని ఆరాటపడుతున్నాడు. ఈ క్రమంలోనే చనిపోయాక మళ్లీ బతికే టెక్నాలజీ వస్తే బతుకుతాం కదా అనే ఆశతో

Update: 2024-08-20 13:00 GMT

దిశ, ఫీచర్స్ : మనిషి మనిషిగా కాకుండా భగవంతుడిగా మారాలని అరటపడుతున్నాడు. ఎప్పటికీ చిరంజీవిగా : ఉండాలని.. చనిపోకూడదని ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నాడు. హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ నుంచి బ్రెయిన్ వరకు.. ఇలా ప్రతీ అవయవాన్ని రీప్లేస్ చేస్తూ.. అమరుడు అయిపోవాలని ఆరాటపడుతున్నాడు. ఈ క్రమంలోనే చనిపోయాక మళ్లీ బతికే టెక్నాలజీ వస్తే బతుకుతాం కదా అనే ఆశతో ఉన్న మానవుల గురించి ఓ కంపెనీ పుట్టుకొచ్చింది. మరణించిన మనుషులను ఫ్రీజ్ చేసి ఏళ్ల పాటు భద్ర పరిచేందుకు ఒప్పందాలు చేసుకుంటుంది. ఇందుకోసం భారీ మొత్తంలో ఛార్జ్ చేస్తుంది.

Tomorrow Bio.. అని పిలువబడే యూరప్ కు చెందిన తొలి క్రయోప్రిజెర్వేషన్ స్టార్ట్ అప్.. లిక్విడ్ నైట్రోజన్ లో బాడీని ఫ్రీజ్ చేసేందుకు పిలుపునిస్తుంది. ఫ్యూచర్ టెక్నాలజీ మీ బాడీకి మళ్లీ ప్రాణం పోయవచ్చనే మెసేజ్ తో తన బిజినెస్ స్టార్ట్ చేసింది. ఒక్కో శవానికి ఏకంగా రూ. 18, 50, 000 వరకు వసూల్ చేస్తుంది. ఇప్పటి వరకు 650 మంది తమ పేరు ఎన్ రోల్ చేసుకున్నట్లు తెలుస్తుండగా.. 2020లో స్థాపించిన ఈ జర్మన్ కంపెనీ ఆల్రెడీ ఆరుగురు మనుషులు, ఐదు జంతువులను ఫ్రీజ్ చేసింది. 2025లో అమెరికాలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేసే ప్లాన్ లో ఉంది.

ఇక ఈ ఫ్రీజింగ్ ప్రాసెస్ చనిపోయిన వెంటనే ప్రారంభం అవుతుంది. స్పెషలైస్డ్ అంబులెన్స్ టీం బాడీని -80°C వరకు కూల్ చేస్తుంది. క్రయోప్రొటెక్టంట్ ఏజెంట్ తో బాడీ ఫ్లూయిడ్స్ ను రీప్లేస్ చేస్తుంది. ఆ తర్వాత కట్టుదిట్టమైన భద్రతల నడుమ -196°C వద్ద స్టోర్ చేయబడుతుంది. కాగా దీనిపై స్పందిస్తున్న జనాలు.. ఇప్పటి వరకు చూసిన బిగ్గెస్ట్ స్కామ్ ఇదేనని అంటున్నారు. ఆల్రెడీ పర్యావరణం కాలుష్యం అయిపోయింది.. మళ్లీ పుట్టి ఇంతకన్నా దారుణమైన పరిస్థితుల్లో బతుకుదామని అనుకుంటున్నారా ఏంటని అభిప్రాయపడుతున్నారు జనాలు.

Tags:    

Similar News