చక్కెర తినడం మానేస్తే ఇన్ని ప్రయోజనాలున్నాయా?
చక్కెర ఒక కార్బోహైడ్రేట్. శరీరానికి శక్తిని అందించేందుకు మూలం. పండ్లు, పాల ఉత్పత్తులు తీసుకున్నప్పుడు వాటిలోని చక్కెరను బాడీ విచ్ఛిన్నం చేస్తుంది. ఎనర్జీగా మారుస్తుంది. అయితే ఇలా నేచురల్ ఫ్రూట్స్, మిల్క్ ప్రొడక్ట్స్ కాకుండా ఆర్టిఫీషియల్ షుగర్
దిశ, ఫీచర్స్: చక్కెర ఒక కార్బోహైడ్రేట్. శరీరానికి శక్తిని అందించేందుకు మూలం. పండ్లు, పాల ఉత్పత్తులు తీసుకున్నప్పుడు వాటిలోని చక్కెరను బాడీ విచ్ఛిన్నం చేస్తుంది. ఎనర్జీగా మారుస్తుంది. అయితే ఇలా నేచురల్ ఫ్రూట్స్, మిల్క్ ప్రొడక్ట్స్ కాకుండా ఆర్టిఫీషియల్ షుగర్ కంటెంట్ తీసుకున్నట్లయితే ఆరోగ్యం ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి మధుమేహం వ్యాధికి దారితీస్తుంది. మరిన్ని దీర్ఘకాలిక ఎఫెక్ట్స్ చూపుతుంది. అలా కాకుండా పంచదార తీసుకోవడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
బరువు తగ్గుదల
షుగర్ తీసుకోవడం తగ్గించడం మొదలుపెడితే ఆటోమేటిక్ గా బరువు తగ్గడం స్టార్ట్ అయిపోతుంది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే చక్కెరలో ఎక్కువ మొత్తంలో ఉండే కేలరీలు.. ఆకలిని పెంచుతుంది. అధికంగా తినడానికి కారణం అవుతుంది. అందుకే దీన్ని తీసుకోవడం ఆపేస్తే ఆకలి తగ్గి.. తక్కువ ఆహారం తీసుకుంటారు. బరువు నియంత్రణలో ఉంటుంది.
మెరుగైన శక్తి స్థాయిలు
చక్కెర తీసుకున్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో పెరుగుదల క్రాష్ లకు కారణం అవుతుంది. తద్వారా శక్తిస్థాయిలలో హెచ్చుతగ్గులు ఏర్పడుతాయి. అదే అసలు మీ ఆహారంలో చేర్చుకోలేకపోతే స్థిరమైన గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. ఇది రోజంతా స్థిరమైన శక్తిని అందిస్తుంది.
గ్లోయింగ్ స్కిన్
అధిక చక్కెర తీసుకోవడం మొటిమలు, రోసేసియా వంటి చర్మ పరిస్థితులకు దారితీస్తుంది. వాపు, మంటను పెంచుతుంది. షుగర్ తీసుకోనప్పుడు ఇవేవీ ఉండవు. స్కిన్ మెరిసిపోతుంది.
హెల్తీ హార్ట్
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చక్కెర తగ్గించడం బెస్ట్ ఆప్షన్. కొలెస్ట్రాల్ స్థాయిలను త గ్గించి.. గుండె జబ్బులకు దారితీసే కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది.
మానసిక ఆరోగ్యం
అధిక పంచదార వినియోగం కాగ్నిటివ్ ఫంక్షన్ ను ప్రభావితం చేస్తుంది. బ్రెయిన్ ఫాగ్ కు దారితీస్తుంది. గ్లూకోజ్ స్థాయిలు సరిగ్గా మెయింటైన్ అవుతుండటం వల్ల.. ఫోకస్ పెరుగుతుంది. అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది. చిరాకు, ఆందోళన తగ్గించి.. మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. మూడ్ బూస్ట్ చేస్తూ డిప్రెషన్ లక్షణాలు తగ్గిస్తుంది.