Neem Leaves: ఈ ఆకుల నీటితో స్నానం చేయడం వలన ఆ సమస్యలన్నీ పరార్

వర్షాకాలంలో ఎంతో మంది ఇన్ఫెక్షన్లకి గురవుతుంటారు.

Update: 2024-08-08 12:54 GMT

దిశ, ఫీచర్స్ : వర్షాకాలంలో ఎంతో మంది ఇన్ఫెక్షన్లకి గురవుతుంటారు. కాబట్టి ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కొందరు అలెర్జీ సమస్యలతో చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు అయినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అక్కడ డబ్బులు పోయడం తప్ప వ్యాధి తగ్గేది ఏమి ఉండదు కాబట్టి మన ఇంటి చుట్టూ పక్కల ఉండే వాటితోనే ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అదెలాగో ఇక్కడ చూద్దాం..

వేప చెట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మనకీ వంద శాతం ఉపయోగపడుతుంది. వేప ఆకు దగ్గర నుంచి ఎండిపోయి చెట్టు వరకు ఇలా చెట్టు మొత్తం మనకి ఉపయోగపడుతుంది. మన రోజూ స్నానం చేసే నీటిలో వేప ఆకులను కలుపుకుంటే ఆరోగ్య సమస్యలకి సులభంగా చెక్ పెట్టొచ్చు. ఎందుకంటే వీటిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.

మహిళల్లో కొందరు చుండ్రు పెద్ద సమస్యగా చెబుతుంటారు అలాంటి వారు వేడి నీటిలో వేప ఆకులను వేసుకుని స్నానం చేయడం వలన ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చేయడం వలన జుట్టు కూడా మెరుస్తుంది. మొటిమల సమస్యలతో ఇబ్బంది పడేవారు వేపాకు వాటర్ తో పేస్ వాష్ చేయడం ద్వారా మొఖంపై ఉన్న డస్ట్ మొత్తం పోయి కాంతివంతంగా కనిపిస్తారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Tags:    

Similar News