ఫంగల్, స్కిన్ ఇన్ఫెక్షన్స్‌ నుంచి ఉపశమనానికి ఈ చిట్కాలు పాటిస్తే చాలు

చలి కాలంతో పాటు ఆయా సీజన్లలో కూడా ఫంగల్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ సమస్యలు తలెత్తుతుంటాయి.

Update: 2023-01-17 07:14 GMT

దిశ, ఫీచర్స్ : చలి కాలంతో పాటు ఆయా సీజన్లలో కూడా ఫంగల్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ సమస్యలు తలెత్తుతుంటాయి. ఇవి రోజువారీ జీవన శైలిని ప్రభావితం చేస్తాయి. పనికి ఆటంకం కలిగిస్తాయి. మానసికంగా బాధ పెడతాయి. కాబట్టి ప్రారంభంలోనే వాటిని గుర్తించి, నివారించడంవల్ల సంతోషంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతారని ఆయుర్వేదిక్ చర్మ వ్యాధుల నిపుణులు సూచిస్తున్నారు. ఫంగల్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల చర్మంపై దురద వస్తూ ఉంటుంది. తరచూ గోక్కోవడంవల్ల పొక్కులు, ఎర్రబడడం వంటి లక్షణాలను కనిపిస్తాయి. కొన్నిసార్లు గోళ్ల దగ్గర చర్మం ఉబ్బి పొక్కుల్లా వస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్యలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు చెప్తున్నారు.

టీ ట్రీ ఆయిల్

ఇన్ఫెక్షన్లను దూరం చేసే గుణం టీ ట్రీ ఆయిల్‌లో ఉంటుంది. ఇందులోని ఔషధ గుణాలు ఫంగల్ ఇన్ఫెక్షన్లను త్వరగా నయం చేస్తాయి. దీనిలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉన్నందున మేలు జరుగుతుంది. కాబట్టి చర్మం, గోళ్ల ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు తప్పకుండా టీ ట్రీ ఆయిల్ చర్మానికి అప్లూ చేస్తే ఉపశమనం లభిస్తుంది.

కలబంద

అలోవెరా లేదా కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. దురద, మంటల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కలబంద జెల్‌ను ఇన్ఫెక్షన్లు ప్రభావితం చేసిన చోట రోజూ రెండు నుంచి మూడుసార్లు పూయడంవల్ల మంచి ఫలితం ఉంటుంది.

వేప బెరడ

వేప చెట్టు నుంచి ఎండిన బెరడ (చెక్క), ఆకులు కూడా చర్మానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. ఇన్ఫెక్షన్ కలిగిన గాయంపై వేప బెరడ (వేప చెక్క) నుంచి తీసిన గంధాన్ని పూయడంతో ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌ తగ్గుతాయి. అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్‌తో ఇబ్బంది పడేవారు వేప ఆకులను నీటిలో వేసి మరగబెట్టి, తర్వాత ఆ నీరు గోరు వెచ్చగా అయ్యాక స్నానం చేసినా, ఇన్ఫెక్షన్ ఉన్నచోట కడిగినా అవి నయం అవుతాయి.

ఇవి కూడా చదవండి : డయాబెటిస్‌ను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేసే ఆకులేంటో తెలుసా.. !

Tags:    

Similar News