AI Sex: బ్రోతల్ VS సైబ్రోతల్.. వ్యభిచార గృహాల్లో సెక్స్ వర్కర్లుగా AI రోబోలు

రెడ్ లైట్ ఏరియా అంటే.. మత్తెక్కించే మల్లెపూల గుభాళింపు.. ఉక్కిరిబిక్కిరి చేసే అత్తరు వాసనలు.. కవ్వించే మగువల చూపులు.. నిలువెల్లా కట్టిపడేసే అమ్మాయిల అందాలను ఇప్పటి వరకు చూశాం.

Update: 2024-09-23 12:36 GMT

రెడ్ లైట్ ఏరియా అంటే.. మత్తెక్కించే మల్లెపూల గుభాళింపు.. ఉక్కిరిబిక్కిరి చేసే అత్తరు వాసనలు.. కవ్వించే మగువల చూపులు.. నిలువెల్లా కట్టిపడేసే అమ్మాయిల అందాలను ఇప్పటి వరకు చూశాం. కానీ ఇది కంప్యూటర్ యుగం.. అంతా స్మార్ట్. అమ్మాయితో పని లేదు.. బ్యూటీపార్లర్లలో అద్దిన అందాలతో అవసరం లేదు. నచ్చిన షేపులో నాజుకైన అందం.. భాగస్వామి మూడ్‌ని బట్టి పడక సుఖాన్ని అందించే నేర్పరులు.. ఒక్కసారి వెళ్తే మళ్లీ మళ్లీ వెళ్లాలనే అనుభూతిని అందించే అప్సరసలు.. ఎంట్రెన్స్‌లోనే నిలువెల్లా స్కాన్ చేసి మీ అభిరుచులకు తగ్గట్టు కామకేళిలో ముంచెత్తె రంభ, ఊర్వశి, మేనకలు ఇక మీ సొంతం. ఇంతకూ ఈ శృంగార తారలు ఎవరనేగా మీ సందేహం. వీళ్లు మనుషులు కాదు.. AI టెక్నాలజీతో జన్మించిన మర మనుషులు. ‘ఇనుములో హృదయం మొలిచేనే..’ అంటూ రోబో సినిమాలో పాటపడుకున్నట్లు ఈ AI రోబోలో కామం చిగురించిందనే చెప్పాలి. ఇప్పటివరకు వ్యభిచార గృహాల్లో ఆడవాళ్లనే చూశాం.. కానీ ఇకపై సైబ్రోతల్స్‌ హౌస్‌లో నచ్చిన రోబోలతో శృంగార కోరికలు తీర్చుకోవచ్చు. ఇది ఎక్కడో పాశ్చాత్య దేశంలో కాదు.. మన ఇండియాలోనే.. గోవాలో అధునాతన సైబ్రోతల్స్‌ (Cybrothel) హౌస్ ఏర్పడి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఇక ఇది రేపోమాపో హైదరాబాద్‌కూ ఎంట్రీ ఇచ్చే అవకాశం లేకపోలేదు.  - భూపతి నాగయ్య

సైబ్రోతల్స్‌ అంటే..

సైబ్రోతల్స్‌ ఇప్పటివరకు పాశ్చాత్య దేశాలకే పరిమితం అయింది. వీటిల్లో AI ఆధారిత సెక్స్ టాయ్స్, రోబోలను వేశ్యలుగా ఉపయోగించుకుంటారు. స్త్రీ, పురుషులు తమ శృంగార కోరికలను తీర్చుకునేందుకు సైబ్రోతల్స్‌‌ను ఆశ్రయిస్తున్నారు. తమ అభిరుచులకు అనుగుణంగా ఈ రోబోలతో సెక్స్‌ను అభవించవచ్చు. భాగస్వామి కోరిన విధంగా ఇక్కడ ఆడ, మగ రోబోలు సెక్స్ సుఖాన్ని అందిస్తాయి. రెడ్ లైట్ ఏరియాలో ఒక సెక్స్ వర్కర్ అందించలేని సుఖాన్ని ఇక్కడ అనుభవించవచ్చు. ప్రస్తుతం సైబ్రోతల్స్‌ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలనే గోవాలో దీనిని ఏర్పాటు చేసి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు.

రోబో సెక్స్.. ఎందుకంత ప్రత్యేకత

మనుషులకు మించి సెక్స్ సుఖాన్ని అందించడం AI ఆధారిత సెక్స్ రోబోల ప్రత్యేకత. భాగస్వామి తన దగ్గరకు రాగానే ఆ మనిషి శరీర ఆకృతి, వారి మానసిక పరిస్థితి, వారి అభిరుచిని గుర్తిస్తాయి. ఇలా విటుల మూడ్‌ను గుర్తించి వారికి ఆనందం కలిగేలా సెక్స్ సుఖాన్ని అందిస్తాయి. విటులను ఉత్సహపరిచేందుకు శృంగార శబ్దాలు చేస్తాయి. అలాగే కోరిన భంగిమల్లో సుఖాన్ని అందిస్తాయి. మరోసారి వస్తే విటులు అడగక ముందే తమ వద్ద డేటా ఆధారంగా వారికి కావాల్సిన శృంగారాన్ని అందిస్తాయి.

లైంగికదాడులు తగ్గే అవకాశం

ప్రస్తుత సమాజంలో కామాంధులు చెలరేగిపోతున్నారు. పసికందు, ముదుసలి అనే తేడా లేకుండా లైంగికదాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి కామాంధులను రోబో సెక్స్‌తో అరికట్టవచ్చు. మితిమీరిన సెక్స్ కోరికలు ఉన్న వాళ్లే అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. ప్రస్తుతం వేశ్యగృహాలను కొంతమంది ఆశ్రయిస్తున్నా.. తరచూ పోలీసుల దాడుల వల్ల కేసులపాలవుతున్నారు. ఈ నేపథ్యంలో AI ఆధారిత రోబోలతో శృంగార కోరికలు తీర్చుకోవడం సులువైన పని. సైబ్రోతల్స్‌ హౌస్‌లు అన్ని అనుమతులతోనే ఏర్పాటు అవుతున్నందున అక్కడ స్వేచ్ఛగా కామ కోరికలను తీర్చుకునే వెసలుబాటు ఉంటుంది. దీని వల్ల సమాజంలో కొంతమేర లైంగికదాడులు తగ్గే అవకాశాలు ఉంటాయి.


హద్దు మీరితే అనర్థాలు తప్పవు

వేశ్య వృత్తిలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను మేళవించడం కొంత ప్రమాదకరమేనని నిపుణలు అభిప్రాయపడుతున్నారు. శృంగారం, ఆనందం విషయంలో వేరే రకాల ఆలోచనలు సెక్స్ చాట్‌బోట్స్ ఎన్‌కోడ్ చేసే అవకాశం ఉందంటున్నారు. సెక్స్ చాట్‌బాట్స్‌కు శిక్షణ ఇచ్చే విషయంలో ఎలాంటి డేటా సెట్టింగులు ఉపయోగిస్తాం అనేది కీలక అంశం అంటున్నారు. సెక్స్ సమయంలో మహిళలకు కలిగే లైంగిగానుభూతిని పట్టించుకోకుండా ఉండే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసభ్యకరంగా ఉండే థీమ్స్, హింస లాంటివి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఏఐ పోర్న్ ప్రమాదకర పరిస్థితుల్లోకి తీసుకెళ్లే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.

సైబర్ నేరాలకు ఆస్కారం

పాశ్చాత్య దేశాల్లోనే కాకుండా ఇండియాలనూ కొత్తగా సైబ్రోతల్స్‌ పేరుతో వ్యభిచార గృహాలు నడుపుతున్నారు. ఈ ఆధునిక వేశ్య గృహాల్లో శృంగార సుఖాన్ని అందించే ఏఐ ఆధారిత సెక్స్‌ టాయ్స్‌ ఉంటాయి. ప్రస్తుతం ఈ సైబ్రోతల్స్‌ హౌస్ గోవాలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఏఐ సెక్స్‌ టాయ్స్‌, రోబోల వల్ల సైబర్ క్రైం జరిగేందుకు ఆస్కారం ఉందని ఐటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైబ్రోతల్స్‌‌కు వచ్చే వ్యక్తుల ప్రవర్తన, మానసిక, శారీరక పరిస్థితి, మూడ్‌ స్వింగ్స్‌ వంటి వివరాలను సెక్స్ రోబోలు సేకరించి సర్వర్లలో భద్రపరుస్తున్నాయి. కొందరి వ్యక్తిగత, బ్యాంకింగ్‌ వివరాలు కూడా సేకరిస్తున్నాయి. అలాగే సుఖం కోసం వెళ్లిన వ్యక్తులతో మాటలు కలిసి వారి పర్సనల్ డేటాని సేకరిస్తున్నాయి. గోప్యంగా ఉండాల్సిన అంశాలను కూడా పంచుకోవడం ప్రమాదకరంగా మారుతుంది. రోబోలు సేకరించిన సమాచారం ఇతర సంస్థలకు విక్రయించడంతోపాటు సైబర్ నేరాలు చేయడానికి ఆస్కారం ఉందని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.


విదేశాల్లో బుకింగ్ సదుపాయం

విదేశాల్లో ఇప్పటికే సైబ్రోతల్ హౌస్‌లు విరివిగా రన్ అవుతున్నాయి. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్స్ డాల్స్‌ విటుల సంతోషం కోసం, వారిలో విచారం పోగొట్టేందుకు మాటలు కలుపుతాయి. స్నేహం చేస్తాయి. శరీరక సుఖాన్ని అందిస్తాయి. ఈ సెక్స్ డాల్స్ వల్ల చాలామంది యువత రిలీఫ్‌‌ ఫీల్ అవుతున్నారు. తమ పర్సనల్ విషయాలు, బాధలు పంచుకుంటూ, కోరికలు తీర్చుకుంటూ స్ట్రెస్‌కు దూరమవుతున్నారు. బెర్లిన్‌లో సెక్స్ డాల్స్‌ను గంటసేపు బుక్ చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. అక్కడి ప్రజలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్స్ డాల్స్‌ కలిసి ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

హైదరాబాద్‌లోనూ సెక్స్ టాయ్స్ షాప్

మెట్రో నగరమైన హైదరాబాద్‌కు సెక్స్ రోబోలు ఇంకా ఎంట్రీ ఇవ్వకపోయినా మూడేళ్ల క్రితమే సెక్స్ టాయ్స్ షాపు వెలసింది. ఐటీ కారిడర్‌ను దృష్టిలో పెట్టుకుని కూకట్ పల్లిలో సెక్స్ టాయ్ షాపు ఓపెన్ అయింది. ఇందులో స్త్రీ, పురుషులకు సంబంధించిన సెక్స్ టాయ్స్ అందుబాటులో ఉన్నాయి. వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ సర్వీస్‌లను కూడా అందిస్తుందీ షాపు. రూ.500 మొదలు రూ.లక్ష వరకు విలువైన సెక్స్ టాయ్స్ లభిస్తున్నాయి. పురుషుల కోసం ప్రత్యేకంగా సెక్స్ డాల్ బొమ్మలను విక్రయిస్తున్నారు. ఇక మహిళలకు వైబ్రేటర్‌తో కూడా సెక్స్ టాయ్స్‌పై ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఆలుమగలకు కలిపి కూడా టాయ్స్ అందిస్తున్నారు. ఈ షాపు ఓపెనింగ్ అయిన సమయంలో మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేసినా ప్రస్తుతం విజయవంతంగా రన్ అవుతుండటం గమనార్హం.

Tags:    

Similar News