వయస్సుకు మించి పెద్దవారిలా కనిపిస్తున్నారా?.. యంగెస్ట్ లుక్స్ కోసం టిప్స్ ఇవిగో..

సహజమైన శారీరక లక్షణాలో, మేకప్ అండ్ డ్రెస్సింగ్ స్టైలో కానీ కొందరు రియల్ ఏజ్‌కు మించి పెద్దవారిలా కనిపిస్తుంటారు.

Update: 2024-06-08 10:55 GMT

దిశ, ఫీచర్స్ : సహజమైన శారీరక లక్షణాలో, మేకప్ అండ్ డ్రెస్సింగ్ స్టైలో కానీ కొందరు రియల్ ఏజ్‌కు మించి పెద్దవారిలా కనిపిస్తుంటారు. దీంతో నలుగురిలో కలిసిపోవడానికి కొందరు ఇబ్బంది పడుతుంటారు. మరికొందరు తమ ఏజ్ విషయంలో ఇతరులు చేసే కామెంట్ల వల్ల గిల్టీగా ఫీలవుతుంటారు. వయస్సును ఎవరూ వెనక్కి అయితే తేలేరు కానీ, యంగెస్ట్ లుక్ రావడానికి కొన్ని చిట్కాలు పనిచేస్తాయంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.

జీవన శైలి - ఆహారపు అలవాట్లు

జీవన శైలి కూడా వ్యక్తి శరీరం, అందం విషయంలో కీలకపాత్ర పోషిస్తుంది. కొందరు హెల్తీ ఫుడ్ కంటే జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తింటుంటారు. బాడీ ఫిట్‌నెస్‌పై ఇంట్రెస్ట్ పెట్టకుండా నచ్చింది తింటూ ఉంటారు. దీనివల్ల అధిక బరువు పెరుగుతారు. సాధారణంకంటే ఎక్కువగా లావు కావడంవల్ల కూడా నిజమైన వయస్సుకంటే ఎక్కువ వయస్సు గలవారీగా కనిపిస్తారు. ఇలాంటి వారు ఆరోగ్య కరమైన ఆహారం మితంగా తీసుకోవడం, రెగ్యులర్‌గా వ్యాయామాలు చేయడంతో బరువు లావు తగ్గి యంగెస్ట్ లుక్‌లోకి రావచ్చు. అందుకు అనుగుణంగా జీవన శైలిని మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

హెయిర్ స్టైల్స్

హెయిర్ స్టైల్స్ కూడా లుక్స్‌ని, ఏజ్‌ను డామినేట్ చేస్తుంటాయి. కొన్ని రకాల పోకడలు పెద్ద ఏజ్ వారిలా కనిపించేందుకు కారణం అవుతాయి. కాబట్టి మీ హెయిర్ స్టైల్ మీ మొహానికి నప్పిందా? దానివల్ల మీరు యంగ్‌గా కనిపిస్తున్నారా? పెద్దవారిలా కనిపిస్తున్నారా? ఒకసారి పరిశీలించుకోండి. ప్రస్తుతం రకరకాల హెయిర్ స్టైల్స్ ఉన్నాయి. మీరు యవ్వనంగా కనిపించే స్టైల్‌ను ఎంచుకొని ఫాలో అయిపోతే సరి.

వేసుకునే మేకప్ ‌బట్టి.. 

తరచుగా మేకప్ చేసేవారు కొన్నిసార్లు చేయకపోవడం వల్ల పెద్ద ఏజ్ వ్యక్తుల్లా కనిపిస్తారు. అసలు మేకప్ చేసే అలవాటు లేనివారికి ఇలాంటి సమస్యే ఉండకపోవచ్చు. కాబట్టి ట్రెండీ అండ్ ట్రెడీషనల్ మేకప్ స్టైల్‌ను ఫాలో అయ్యేవారు తమకు ఏ మేకప్ వల్ల యంగెస్ట్ లుక్ వస్తుందో చెక్ చేసుకొని అనుసరిస్తే చాలు.

స్కిన్ కేర్ రొటీన్స్

స్కిన్ కేర్ రొటీన్స్ ఫాలో అవకపోతే చర్మంపై ముడతలు, మచ్చలు వంటివి ఏర్పడి ఏజ్ బార్ కనిపిస్తుంది. కాబట్టి తరచుగా బయటకు వెళ్లిరాగానే స్నానం చేయడం లేదా మొహం కడుక్కోవడం, మేకప్ చేసి ఉంటే ఇంటికి వచ్చాక ఎక్కువసేపు అలాగే ఉండకుండా రిమూవ్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మీ స్కిన్‌ను బట్టి ఏ మేకప్ వేయాలో, వేయకూడదో, ఏ క్రీములు రాయాలో, రాయకూడదో కూడా తెలిసి ఉండాలి. హెల్తీ టిప్స్ ఫాలో అయితే యంగెస్ట్ లుక్ మీ సొంతం.

డ్రెస్సింగ్ స్టైల్

వేసుకునే దుస్తులను బట్టి కూడా వయస్సు కాస్త అటూ ఇటూ కనిపిస్తుంది. కంఫర్ట్‌గా ఉన్నప్పటికీ కొన్ని రకాల డ్రెస్సింగ్ స్టైల్ మీరు పెద్దవారిలా కనిపించేందుకు కారణం అవుతుంది. మహిళలకు అయితే రౌండ్ నెక్స్ కాస్త ఏజ్‌బార్ అనిపించేలా చేస్తాయి. కాబట్టి క్లోజ్డ్ నెక్‌డ్రెస్‌లు లేదా షర్టులు ట్రై చేయవచ్చు. అలాగే మీ స్కిన్ టోన్‌కి, శరీరానికి ఏ దుస్తులు వేసుకుంటే యంగ్‌గా కనిపిస్తారో వాటిని ఎంచుకోవడం బెటర్. 


Similar News