బిస్కెట్లను ఎక్కువగా తింటున్నారా..? అయితే, ప్రమాదమే..!

బిస్కెట్లను పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడి తింటుంటారు.

Update: 2024-11-12 13:51 GMT

దిశ, ఫీచర్స్: బిస్కెట్లను పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడి తింటుంటారు. ఇటీవల కాలంలో చాలా మంది బిస్కెట్లను అధికంగా తింటున్నారు. ఇందులో రకరకాల బిస్కెట్లను స్నాక్ ఐటమ్‌గా ఎక్కువగా తింటుంటారు. అయితే, వీటిని ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఇందులో చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్, ప్రాసెస్డ్ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యపరమైన సమస్యలక కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి రుచితోపాటు కొంత కడుపు నిండడానికి ఉపయోగపడిన్పపటికీ.. కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక సమస్యలకు కారణం అవుతాయి. కొన్ని రకాల బిస్కెట్లలో అధిక కొవ్వు ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే చక్కెర, రక్తంలోని చక్కెర స్థాయిని పెంచుతుంది.

బిస్కెట్లు తినడం వల్ల కలిగే సమస్యలు:

* కొన్ని రకాల బిస్కెట్లలో కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది ఒక రకమైన ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్. ఇటువంటి వాటిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ కంటెంట్ పెరుగుతుంది. ఇది గుండె సంబంధ వ్యాధులకు కారణం కావచ్చు.

* మరికొన్ని రకాల బిస్కెట్లలో పిండి, పంచదారతో పాటు ఇతర పదార్థాలు ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే చర్మంపై చిరాకు, అలర్జీ వంటివి వచ్చే అవకాశం ఉంది.

* వీటిలో పోషకాలు ఉన్నప్పటికీ వాటిని రెగ్యులర్‌గా తింటే, శరీరానికి అవసరమైన ఇతర పోషకాల కొరత ఏర్పడి, పోషకాహారంలో అసమతుల్యత ఏర్పడుతుంది.

* అంతేకాకుండా ఇందులోని పిండి శరీర జీవక్రియ పనితీరును నేరుగా ప్రభావితం చేస్తుంది. దీని వల్ల జీర్ణక్రియ సమస్యలు ఏర్పడతాయి. ఇది మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలకు కారణమవుతుంది. అందుకే వీటిని మితంగా తినడం మంచిది.

బిస్కెట్లు అన్నీ ఒకే రకంగా ఉండవు. వీటిని తినేటప్పుడు వాటిపై ఎక్స్‌పైరీ డేట్ చూసి తినడం మంచిది. చక్కెర స్థాయి తక్కువగా ఉండే బిస్కెట్లు తినాలి.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు.


Read More ...

Wine cake : వైన్ కేక్ తయారీ షురూ...క్రిస్మస్ వేడుకల స్పెషల్




Tags:    

Similar News