బాయిలర్ చికెన్ తింటున్నారా.. ఎదుర్కొనే సమస్యలివే?

నాటు కోళ్లు అంటే ఆరోగ్యానికి మేలు. కానీ ఫారెన్ కోళ్లను ఎక్కువగా తింటే మాత్రం లేనిపోని ఆరోగ్య సమస్యలు తప్పవు.

Update: 2024-08-05 13:10 GMT

దిశ, ఫీచర్స్: నాటు కోళ్లు అంటే ఆరోగ్యానికి మేలు. కానీ ఫారెన్ కోళ్లను ఎక్కువగా తింటే మాత్రం లేనిపోని ఆరోగ్య సమస్యలు తప్పవు. కోళ్లకు పెట్టే ఆహారం ఆర్సెనిక్ అనే విషరసాయనం ఉంటుంది. దీనివల్ల కోళ్లు మంచి కలర్‌లోకి వస్తాయి. దిట్టంగా పెరుగడమే కాకుండా అడుగు తీసి అడుగు వేయనంత బరువు పెరుగుతాయి. కానీ ఆ కోళ్లను మనం ఎక్కువగా తింటే గుండె జబ్బులు, డయాబెటిస్, నరాల బలహీనత, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సూపర్ మార్కెట్‌లో నిల్వ ఉంచే చికెన్‌లో 50 శాతం ఆర్సెనిక్ విషరసాయనం ఉంటుంది.

వారానికి ఒకటి రెండు సార్లు వండుకుంటే పర్లేదు కానీ.. వారంలో నాలుగైదు సార్లు, లేదా వారం మొత్తం తింటే తప్పకుండా ప్రమాదం పొంచి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పైగా బాయిలర్ కోళ్ల మాంసం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. ఎందుకంటే ఈ కోళ్లు తొందరగా ఎదగడానికి యాంటీబయాటిక్స్ ఇస్తారు. వీటికి కొంచెం స్థలంలో ఎక్కువ కోళ్లను పెంచుతారు. పైగా ఈ కోళ్లలో పోషక విలువలు చాలా తక్కువగా ఉంటాయి.

దీంతో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించే చాన్సెస్ ఉన్నాయని, దీంతో అధిక బరువు, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, అంటు వ్యాధులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ కోడిలో సాధారణ కోడి కంటే అధిక కొవ్వు ఉంటుంది. దీంతో హార్ట్ ఎటాక్ వస్తుంది. హార్మోన్ల అసమతుల్యత, రోగనిరోధక శక్తి బలహీనపరచడం, క్యాన్సర్ ప్రమాదం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News