Health : ఈ మూడు ప్రాబ్లమ్స్ ఉంటే బాదం తినొద్దు.. ఏం జరుగుతుందంటే!

Health : ఈ మూడు ప్రాబ్లమ్స్ ఉంటే బాదం తినొద్దు.. ఏం జరుగుతుందంటే!

Update: 2024-12-31 13:58 GMT

దిశ, ఫీచర్స్ : బాదం.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రై ఫ్రూట్స్‌లో ఇదొకటి. ఇందులో విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, కాల్షియం, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఫుల్లుగా ఉంటాయి. కాబట్టి తింటే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అయితే కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు మాత్రం వీటిని తినకూడదు. ఆ ప్రాబ్లమ్స్ ఏమిటి? ఎందుకు తినకూడదో చూద్దాం.

* మైగ్రేన్ : మైగ్రేన్‌తో బాధపడేవారు బాదం తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో విటమిన్ - ఇ అధికంగా ఉంటుంది. మైగ్రేన్ లేదా తలనొప్పి ఉన్నప్పుడు బాదం తింటే ఈ సమస్య మరింత పెరుగుతుంది. మైకం, వికారం, వాంతులు వంటివి వస్తాయి.

* అధిక రక్తపోటు : హైబీపీ ఉన్నవారు కూడా బాదం ఎక్కువగా తినవద్దు. ఇందులో మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాట్టి అది రక్తపోటును మరింత పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఒకవేళ తినాలనుకుంటే వైద్యుల సలహాతో పరిమితంగా తినాలి.

*కిడ్నీ స్టోన్స్ : కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు కూడా బాదం పప్పులు తినడం మంచిది కాదు. వీటిలో ఆక్సలేట్ సమ్మేళనం అధికంగా ఉంటుంది. ఇది మూత్ర పిండాల్లోకి చేరితో కాల్షియం పేరుకుపోయి రాళ్లుగా ఏర్పడతాయి. అట్లనే కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు వీటిని తింటే అప్పటికే రాళ్లు ఉంటే వాటి పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది.

*గమనిక :పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 

Tags:    

Similar News

Mr. మొహ‌మాటం.!