అడ్డగించిన 6 మంది మగాళ్లని చితక్కొట్టిన అమ్మాయి.. అవాక్కయ్యే వీడియో!
పురుషులను పొట్టు పొట్టు కొట్టి, పరుగులు పెట్టించింది. A video of a lady taking down six men by herself just went viral.
దిశ, వెబ్‌డెస్క్ః ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షలాది మంది స్త్రీలు లైంగికంగా వేధింపులకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో బహిరంగంగానే రేప్‌కు తెగబడటం ఫ్యాషన్‌గా మారినట్లు కనిపిస్తుంది. రక్షణ కల్పించాల్సిన నాయకులు, వారి పుత్రరత్నాలు అధికార మదంతో అత్యాచారాలకు పాల్పడుతుంటే, చట్టం ఎంత కఠినంగా ఉన్నా దాన్ని అమలుపరచడంలో అధికారుల చేతివాటం ఎంత వేగంగా పనిచేస్తుందో ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇలా చాలా తరచుగా, వర్గ, వర్ణ విభేధాలు లేకుండా ఆడవాళ్లపై జరుగుతున్న వేధింపుల నుండి తనను తాను రక్షించుకునే బాధ్యత ఇప్పుడు పోలీసుల కంటే బాధితులపైనే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. నేరస్థుల నుండి తమను తాము రక్షించుకోవడానికి మహిళలు స్వీయ-రక్షణలో శిక్షణ తీసుకోక తప్పడం లేదనిపిస్తుంది. దీనికి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. ఓ అమ్మాయి తనను వేధించడానికి వచ్చిన ఆరుగురు పురుషులను పొట్టు పొట్టు కొట్టి, పరుగులు పెట్టించింది.
ఈ వీడియో రికార్డయిన ప్రదేశం ఎక్కడ అనేది ఇంకా తెలియరాలేదు. కానీ, అమ్మాయి పోరాటపఠిమ, ధైర్యసాహసాలు ఎంతో మందికి ప్రేరణగా ఉన్నాయంటూ నెటిజనులు ప్రశంసిస్తున్నారు. ఫ్లయింగ్ కిక్‌తో సహా మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్‌తో చిచ్చరపిడుగులా రెచ్చిపోయిన యువతికి చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. ఈ వీడియోను 'ది ఫిగెన్' ఖాతా ట్విట్టర్‌లో షేర్ చేశారు. "అమ్మాయితో గొడవ పడకండి! Hiyaaaaaaaaaaaaa!" అనే శీర్షకతో వీడియో వైరల్ అయ్యింది. ఆమె ధైర్యసాహసాలు, బలానికి నెటిజన్లు విస్మయం వ్యక్తం చేయగా. మహిళలు రోజూ ఇలాంటి దారుణమైన కష్టాలను ఎదుర్కోవాల్సి రావడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ కొడుకులకు స్త్రీ విలువను చెబితే, ఇలాంటి అఘాయిత్యాలు జరగవంటూ మరికొందరు వ్యాఖ్యానించారు.