టెక్నాలజీని వాడుకున్న రామచిలుక.. యజమానికి ఊహించని షాక్

సాధారణంగా చాలా మంది జంతువులను, పక్షులను పెంచుకోవటం మనం చూస్తునే ఉంటాం.

Update: 2025-03-19 04:47 GMT
టెక్నాలజీని వాడుకున్న రామచిలుక.. యజమానికి ఊహించని షాక్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా చాలా మంది జంతువులను, పక్షులను పెంచుకోవటం మనం చూస్తునే ఉంటాం. అంతేకాదు, వాటిని (Pets) తమ ఇంట్లో ఒక సభ్యులుగా చూసుకుంటారు. అవి చేసే అల్లరి చేష్టలు చూసి మురిసిపోతుంటారు. అయితే కొన్నిసార్లు అవి యాజమాని సైతం ఊహించని పనులు చేసి ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా యూకేలో (UK) ఇలాంటి ఓ ఘటనే చోటుచేసుకుంది. తన పెంపుడు పక్షి రామచిలుక (Parrot) చేసిన పనికి ఏకంగా ఆ యజమాని ఇంట్లోని అలెక్సాను సైతం తీసేయాల్సి వచ్చింది.

పక్షుల్లో రామచిలుకను ఇష్టపడని వారుండరు. అందంగా ఉండడమే కాదు, మనిషిలా మాట్లాడుతూ సందడి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే యూకేలో ఓ మహిళ ఇంట్లో రామచిలుకను పెంచుకుంటుంది. దానికి రోకో అని పేరు పెట్టి ముద్దు ముద్దుగా మాటలు కూడా నేర్పించింది. ఇక యాజమానికి అనుకరించటం నేర్చుకున్న రామ చిలుక యజమాని ఇంట్లో లేని సమయంలో వాయిస్ కమాండ్ స్పీకర్ అలెక్సాను (Alexa) ఉపయోగించి తనకు కావాల్సిన పండ్లు, కూరగాయలు, స్నాక్స్‌ను అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకోవటం ప్రారంభించింది.

అయితే, వరుసగా డెలివరీలు రావటం చూసి ఆ యజమాని ఆశ్చర్యానికి గురైంది. తాను ఆర్డర్ చేయకుండా ఇవ్వని ఎలా వస్తున్నాయనే అయోమయంలో పడిపోయింది. ఆ తర్వాత ఇదంతా రామచిలుక పని అని తెలుసుకుని అలెక్సాను ఇంట్లో నుంచి తీసేసింది. ఈ సంఘటనను యజమాని సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకోవటంలో ఈ రామచిలుక సూపర్ అంటూ కొందరు కామెంట్లు పెట్టగా, ఇది వినడానికి ఫన్నీగా అనిపించిన టెక్నాలజీ దుర్వినియోగానికి కారణం అవ్వొచ్చని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read More..

Steal Other's Wives: అక్కడి ప్రజలు వారి భార్యతో కాకుండా ఇతరుల భార్యలను అనుభవిస్తారు.. ఎవరైనా అడ్డొస్తే అంతేసంగ... 

Tags:    

Similar News