లవ్‌ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న అమెరికన్లు 36 శాతమేనట.. వన్‌పోల్ సర్వేలో వెల్లడి

అమెరికన్ జంటల్లో రిలేషన్‌షిప్స్ మధ్య ప్రేమానురాగాలు గతంకంటే తగ్గుతున్నాయని, సెక్స్ లైఫ్ ఎంజాయ్‌మెంట్‌ తగ్గుతోందని వన్‌పోల్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.

Update: 2023-04-16 08:13 GMT

దిశ, ఫీచర్స్ : అమెరికన్ జంటల్లో రిలేషన్‌షిప్స్ మధ్య ప్రేమానురాగాలు గతంకంటే తగ్గుతున్నాయని, సెక్స్ లైఫ్ ఎంజాయ్‌మెంట్‌ తగ్గుతోందని వన్‌పోల్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. అత్యధిక మంది తమ జీవిత భాగస్వామితో సంతృప్తిగా ఉండటం లేదని పేర్కొంది. కేవలం 36 శాతం మంది మాత్రమే లైఫ్ పార్టనర్‌తో సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నామని ఈ సర్వే పేర్కొన్నది. అంతేగాక ప్రతీ ఐదుగురు అడల్ట్స్‌లో ఒకరు మూడేళ్ల కంటే ఎక్కువ కాలం ఒకే రిలేషన్ షిప్‌లో ఉండటం లేదు. లవ్, సెక్స్ పరంగా సంతృప్తి లేకపోవడమే ఇందుకు కారణమని అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తం 5,000 మంది అమెరికన్లపై జరిపిన సర్వేలో సుదీర్ఘకాలంపాటు ఒకే రిలేషన్ షిప్‌లో కొనసాగుతూ జీవితాన్ని సంతోషంగా గడిపినవారు తక్కువమంది ఉంటున్నారు. ఒక్క న్యూ హాంప్‌షైర్‌(New Hampshire) ప్రాంతంలో మాత్రం కనీసం 15 సంవత్సరాల వరకు జంటలు సంతోషంగా కలిసి ఉంటున్నాయి.

టీనేజ్‌లో డేటింగ్

అయితే మూడింట ఒకవంతు జంటలు తాము టీనేజీలోకి అడుగు పెట్టగానే డేటింగ్ ప్రారంభించామని తెలిపారు. మసాచుసెట్స్, న్యూయార్క్, వ్యోమింగ్‌లలో 50% శాతంమందిని ప్రశ్నించగా 38% మంది ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇటువంటి పరిస్థితి కూడా భాగస్వాముల మధ్య అసంతృప్తికి కారణం అవుతోంది. హోప్ లెస్ రొమాంటిక్ జీవితాన్ని నెట్టుకొస్తున్నవారు ఉటా 35% శాతం మంది, ఓక్లహోమా 34% మంది, వెస్ట్ వర్జీనియా 32% మంది, పెన్సిల్వేనియా, మిస్సౌరీలలో 32% చొప్పున, కాలిఫోర్నియా 36 శాతం మంది ఉన్నారు. అమెరికన్ జంటల్లో ప్రతీ ఐదుగురిలో ఒకరు తమ భాగస్వామి తమను మోసం చేస్తున్నాడని చెప్పారు. ఇలా మోసపోయిన వారిలో విస్కాన్సిన్‌కు చెందిన వారు ఎక్కువగా 52% మంది ఉన్నారు. అమెరికాలో సగటు ఒక వ్యక్తి తన జీవితకాలంలో నలుగురితో సీరియస్‌గా డేటింగ్ చేసినట్లు కూడా సర్వేలో తేలింది. ఒకే వ్యక్తితో కొనసాగేవారు చాలా అరుదు. ఇల్లినాయిస్(from Illinois) చెందినవారిలో మాత్రం చాలామంది ఒక భాగస్వామితో జీవితాంతం కలిసి ఉంటున్నవారు అత్యధికమంది ఉన్నారట.

వ్యక్తిగత అంశాలు

అయితే రిలేషన్ షిప్స్ వ్యక్తిగతమైనవి. ఆయా ప్రాంతాలు, అక్కడి సంస్కృతులు, సంప్రదాయాలను బట్టి కూడా అవి కొనసాగడం, లేదా మారుతుండటం జరగవచ్చు. లవ్ అండ్ ఎంజాయ్ మెంట్ విషయానికి వస్తే అందరూ ఒకేలా ఉండటం లేదని సర్వేలో పాల్గొన్న లియో తెలిపాడు. ఆయా జంటల సొంత ఆలోచనలు, అవసరాలపై ఆధారపడి లవ్, సెక్స్, ఆనందం, స్వేచ్ఛ ఉంటాయని సర్వే అధికారులు పేర్కొన్నారు.

వారానికి మూడుసార్లు

సగటున అమెరికన్లు తమ భాగస్వామితో వారానికి మూడుసార్లు మాత్రమే రొమాంటిక్ జీవితాన్ని గడుపుతున్నారు. అమెరికా మొత్తంగా చూస్తే 36 శాతం జంటలు మాత్రమే సెక్స్ పరమైన లైఫ్‌ అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇక మిగతా వారి విషయాలను పరిశీలిస్తే పార్టనర్‌తో కలిసి బయటకు డిన్నర్‌కు వెళ్తున్న వారు 46% మంది, రాత్రి పూట కలిసి ఉంటున్నవారు 28% మంది, సినిమాలకు వెళ్తున్నవారు 22% మంది ఉంటున్నారు. కాలిఫోర్నియాలో 46%, ఓక్లహోమా 44% తమ భాగస్వామితో ప్రేమగా ఉంటున్నట్లు తేలింది. రొమాంటిక్ విషయాలను గమనిస్తే లూసియానా 58%, సౌత్ కరోలినా 54%, డెలావేర్ 50% శాతం తమ సెక్స్ జీవితం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. ఇరవై తొమ్మిది శాతం మంది తమ ప్రస్తుత భాగస్వామితో కలిసి ఉన్న ఒక నెలలోనే సన్నిహితంగా ఉన్నారు.

భాగస్వామిపై ఆధిపత్యం

తమ కోరికలు, ప్రాధాన్యతలను బహిరంగంగా చర్చించడం, అభిప్రాయాలను వెల్లడించడం చాలాముఖ్యమని 74 శాతం జంటలు భావిస్తున్నాయి. అయితే ప్రతీ ఏడుగురిలో ఒకరు రిలేషన్ షిప్‌లోకి అడుగుపెట్టిన మొదటి నెలలోనే తమ భాగస్వామికి అసంతృప్తుల గురించి చెబుతున్నారట. 20 శాతంమంది తమ భాగస్వామితో డర్టీగా మాట్లాడటం చేస్తుండగా, 11 శాతం మంది ఆధిపత్యం చలాయిస్తున్నారు. సెక్స్ జీవితం సంతృప్తికరంగా లేకపోవడంతో 16% మంది సెక్స్ టాయ్స్, వైబ్రేటింగ్ డాల్స్‌ను యూజ్ చేస్తున్నారు.

Tags:    

Similar News