‘కార్టిసాల్- డిప్రెషన్’.. రెండింటి మధ్య సంబంధం ఏంటి?
ఇటీవల చాలా మంది ఒత్తిడికి లోనవుతున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల చాలా మంది ఒత్తిడికి లోనవుతున్నారు. తద్వారా మెల్లిమెల్లిగా విపరీతమైన ఆలోచనలతో డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు. దీనికి కారణమేంటో ఖచ్చితంగా తెలియనప్పటికీ.. దీని అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. డిప్రెషన్ సాధారణంగా జీవిత సంఘటనలు, వ్యక్తిగత కారకాలు అండ్ మెదడులోని మార్పుల కలయిక వల్ల వస్తుంది. డిప్రెషన్ అనేది మానసిక స్థితి తక్కువగా ఉండటం, అపరాధం, చిరాకు , అలసట, కార్యకలాపాల్లో ఆసక్తి లేదా ఆనందం కోల్పోవడం వంటి లక్షణాలతో కూడిన సంక్లిష్టమైన మానసిక ఆరోగ్య పరిస్థితే డిప్రెషన్. అయితే డిప్రెషన్ కు కార్టిసాల్‌కు సంబంధమేంటని చాలా మందిలో ఈ ప్రశ్న తలెత్తే ఉంటుంది.
కాగా తాజాగా నిపుణులు డిప్రెష్ అండ్ కార్టిసాల్ కు ఉన్న సంబంధం ఏంటని క్లారిటీ ఇచ్చారు. మన బాడీ ఒక్కోసారి కార్టిసాల్ ను రిలీజ్ చేస్తుంది. కార్టిసాల్ శరీర సాధారణ ప్రక్రియ. ఆరోగ్యకరమైన కార్టిసాల్ మార్నింగ్ కాకుండా నైట్ 9నుంచి 9 గంటల మద్య రిలీజ్ అయితే అది డిప్రెషన్‌కు కారణమవుతుందని తాజాగా స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫసర్లు వెల్లడించారు. కాగా ఈ సమస్య తలెత్తవద్దు అంటే ఉదయాన్నే సూర్యరశ్మి శరీరానికి తగలడం అత్యంత అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. ఇక కార్టిసాల్ అనే పేరు కార్టెక్స్ అనే పదం నుంచి వచ్చింది. కార్టెక్స్ అంటేబాహ్య పొ అడ్రినల్ కార్టెక్స్‌కు సూచన, కార్టిసాల్ ఉత్పత్తి అయ్యే అడ్రినల్ గ్రంధిలో భాగం.