China : లద్ధాఖ్ లో మళ్ళీ చైనా స్థావరాలు.. భారత్ స్పందన ఇదే!

లద్ధాఖ్‌(Laddhakh)లో చైనా(China) మళ్ళీ స్థావరాలను ఏర్పాటు చేసింది.

Update: 2025-01-03 17:19 GMT

దిశ, వెబ్ డెస్క్ : లద్ధాఖ్‌(Laddhakh)లో చైనా(China) మళ్ళీ స్థావరాలను ఏర్పాటు చేసింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. అక్రమంగా భారత్ భూభాగాన్ని ఆక్రమించుకోవడాన్ని సహించబోమని తేల్చిచెప్పింది. రెండుస్థావరాల్లోని కొంత భూభాగం లద్ధాఖ్‌లో భాగం కావడం వల్ల దౌత్య మార్గాల ద్వారా నిరసన తెలిపినట్లు విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు. టిబెట్‌(Tibet)లో బ్రహ్మపుత్ర(Brahmaputra) నదిపై డ్యామ్ నిర్మించాలన్న చైనా నిర్ణయాన్ని సమీక్షించామని తెలిపారు. ఈ విషయంలో భారత్ ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ డ్యాం నిర్మాణం వలన అరుణాచల్​తో పాటు అసోం రాష్ట్రాలకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే చైనా ఈ ఆనకట్ట నుంచి ఒక్కసారిగా భారీగా నీళ్లు విడుదల చేస్తే, కింద భూభాగాలను ముంచేస్తుందని భారత్​ఆందోళనలను వ్యక్తం చేస్తోంది.

Tags:    

Similar News