Trisha : తమిళనాడుకు సీఎం కావడం నా కల : త్రిష

ఏదోకరోజు తమిళనాడు(Tamilanadu)కు సీఎం కావడం నా కల అంటూ నటి త్రిష(Trisha) సంచలన వ్యాఖ్యలు చేసింది.

Update: 2025-01-05 12:49 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏదోకరోజు తమిళనాడు(Tamilanadu)కు సీఎం కావడం నా కల అంటూ నటి త్రిష(Trisha) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల త్రిష మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉందంటే.. సామాజిక సమస్యలపై పోరాడుతూ, ప్రజా సేవ చెయ్యాలన్నది తన ఆలోచన అని ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది త్రిష. ఇలా చేయాలంటే కేవలం రాజకీయాల వల్లే సాధ్యమని ఆమె అభిప్రాయపడింది. తనకు రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆసక్తి చాలా ఉందన్న త్రిష.. ఏదో ఒకరోజు తమిళనాడుకి ముఖ్యమంత్రి కావాలనేది తన కోరిక అని చెప్పుకొచ్చింది. త్రిష కామెంట్స్ చూస్తుంటే ఆమె వచ్చే ఎన్నికల టైమ్ నాటికి రాజకీయాల్లోకి రావడం ఖాయంగానే కనిపిస్తుంది. విజయ్‌(Vijay)కి పోటీగా ఆమె రాజకీయాల్లోకి వస్తుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక 2026 ఏప్రిల్ లేదా మే నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు(Tamilanadu Assembly Elections) జరగనున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News