HMPV వైరస్ పై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సమీక్ష.. రాష్ట్రాలకు కీలక సూచన

చైనాలో విపరీతంగా వ్యాప్తి చెందుతున్న HMPV వైరస్ కేసులు సోమవారం భారత దేశంలో కూడా వ్యాప్తి చెందాయి.

Update: 2025-01-07 05:01 GMT

దిశ, వెబ్ డెస్క్: చైనాలో విపరీతంగా వ్యాప్తి చెందుతున్న HMPV వైరస్ కేసులు సోమవారం భారత దేశంలో కూడా వ్యాప్తి చెందాయి. దీంతో అప్రమత్తమైన కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది. అలాగే ప్రస్తుతం నమోదైన కేసుల వివరాలను వెంటనే పంపాలని కొరింది. అనంతరం ఎప్పటికప్పుడు హెచ్ఎమ్‌పీవీ(HMPV) కేసులకు సంబంధించిన అప్ డేట్లాను అందించాలని సూచింది. అయితే ఈ వ్యాధి వల్ల పెద్దగా ప్రభావం లేదని.. తగిన జాగ్రత్తలు(Precautions) తీసుకుంటే సరిపోతుందని ఆరోగ్య శాఖ(Health Department ) సోమవారం స్పష్టం చేసింది. అయితే దేశంలో శ్వాసకోశ వ్యాధుల ప్రస్తుత పరిస్థితిని, దాని నిర్వహణ కోసం ప్రజారోగ్య చర్యల స్థితిని మంగళవారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి(Union Health Secretary) సమీక్షించారు. నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలని రాష్ట్రాలకు సూచించారు.

ILI/SARI నిఘాను బలోపేతం చేసి సమీక్షించాలని కూడా రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. సోమవారం ఉదయం 2 హెచ్ఎంపీవీ కేసులు(HMPV Cases) నమోదు కాగా.. ఆ కేసుల సంఖ్య సాయంత్రానికి 6 కు చేరింది. బెంగుళూరులో ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్ ను గుర్తించామని చెప్పి, సదరు నమూనాలను మరోసారి పరీక్షల నిమిత్తం పంపించారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మరో నాలుగు కేసులు నమోదు అయ్యాయి. అలాగే మంగళవారం ఉదయం మహారాష్ట్రంలో మరో రెండు కేసులు నమోదవడంతో ఈ కేసుల సంఖ్య ప్రస్తుతం 8కి చేరింది.


Similar News