Viral: రియల్ హంటర్ యోగానంద్.. పులి తోక పట్టుకొని లాగి బంధించిన రైతు
చిరుత పులి(Leopard)ని ఓ వ్యక్తి తోక(Tail) పట్టుకొని లాగిన(Dragging) వీడియో సమాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
దిశ, వెబ్ డెస్క్: చిరుత పులి(Leopard)ని ఓ వ్యక్తి తోక(Tail) పట్టుకొని లాగిన(Dragging) వీడియో సమాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కర్ణాటక(Karnataka) రాష్ట్రం, తూముకూరు జిల్లా(Tumkur district) చిక్కకొట్టిగేహళ్లి(Chikkakottigehally) అనే గ్రామంలో చిరుత పులి సంచరిస్తూ.. పశువులపై దాడి చేస్తున్నదని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఫారెస్ట్ అధికారులు పులిని పట్టుకునేందుకు బోనుతో సహా గ్రామానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి పులిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. రెండు సార్లు తప్పించుకుంది.
దీంతో మరోసారి బోను వేసి, ఎదురు చూస్తుండగా.. పులి ఒక్కసారిగా పొదల్లోనుంచి దూసుకొచ్చింది. అక్కడే ఉన్న మహిళలు, పిల్లలపై దాడి చేయబోతుందని గ్రహించిన యువ రైతు యోగానంద్(Yoganand) సహసం ప్రదర్శించాడు. పులి తోక పట్టుకొని, గుండ్రంగా తిప్పాడు. ఈ లోగా అటవీ అధికారులు పులిపై వల వేసి బంధించారు. అనంతరం ఫారెస్ట్ అధికారులు పులిని రెస్క్యూ సెంటర్ కు తరలించారు. మహిళలపై దాడి చేయబోతున్న పులిని సహసంతో పట్టుకున్న యోగానంద్ పై అధికారులు ప్రశంసలు కురిపించారు. అయితే పులి తోక పట్టుకొని లాగిన వీడియో నెట్టింట వైరల్(Viral) అయ్యింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. యోగానంద్ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. అంతేగాక రియల్ హంటర్(Real Hunter) యోగానంద్ అని యువరైతును ప్రశంసిస్తున్నారు.