New Year: నూతన సంవత్సరం వేళ పార్టీకి సిద్ధమయ్యారా.. అతిగా మద్యం సేవిస్తే జరిగేదిదే?

ప్రతి ఏటా జనవరి 31 వ తేదీ నైట్ చాలా మంది ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు.

Update: 2024-12-31 14:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఏటా జనవరి 31 వ తేదీ నైట్ చాలా మంది ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. కేక్ కట్(Cake cutting) చేయడం, ఫ్రెండ్స్(Friends), కుటుంబ సభ్యుల(Family members)కు, సన్నిహితుల(close friends)కు హ్యాపీ న్యూయర్(Happy New Year) అంటూ విష్ చేయడం వంటివి చేస్తుంటారు. కొంతమంది ఆల్కహాల్(Alcohol) తాగుతుంటారు. పార్టీల్లో, పబ్‌లో ఆల్కహాలు తప్పనిసరిగా ఉండాల్సిందే.

దీనిలో కూడా అనేక రకాలుంటాయన్న విషయం తెలిసిందే. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని సీసాలపైనే రాసున్న చాలా మంది అదేపనిగా తాగుతుంటారు. అయితే ఈ ఏడాది చివరి తేదీ అయిన 31 వ తారీకున అతిగా మద్యం సేవిస్తే శరీరంలో ఎలాంటి ప్రభావాలు కలుగుతాయో తాజాగా నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మద్యం తాగినాక శరీరంలో అనేక మార్పులు కనిపిస్తాయి. వికారంగా అనిపించడం, తర్వాత వెంటనే వామిటింగ్స్(Vomitings) అవ్వడం.. దీంతో హ్యాంగోవర్‌(Hangover)లోకి వెళ్లిపోతారు. ఇలా కావడం వల్ల అనేక హెల్త్ ప్రాబ్లమ్స్(Health problems) ఫేస్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా జీవన శైలిని, పనిని, స్టడీపై కూడా ప్రభావం చూపిస్తుంది. చదివిన చదువు కూడా గుర్తుపెట్టుకోలేరు. ఏ పనిమీద శ్రద్ధ(attention) పెట్టరు.

మద్యం నేరుగా కాలేయానికి చేరుతుంది. ఆల్కహాల్‌లోని ఇథనాల్ ఆహారనాళం(Ethanol alimentary tract)లోని వేగంగా జారడం వల్ల కాలయాన్ని విచ్ఛిన్నం చేసి.. జీవక్రియలు నిర్వహించడానికి ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా కాలేయంలోని డిహైడ్రోజెనీస్ (Dehydrogenase)అనే ఎంజైముల(Enzymes) ద్వారా విచ్ఛిన్నం చేసే ప్రమాదముంది.

అలాగే ఎంజైముల యాక్టివిటీ తీవ్రంగా పెరుగుతుంది. కడుపులో ఇన్ఫ్లమేషన్(Inflammation) ప్రారంభమవ్వడమే కాకుండా.. లివర్‌(liver)పై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా కణాలు దెబ్బతింటాయి. మద్యం సేవించడం వల్ల ఫ్యాటీ లివర్‌ డిసీజ్(Fatty liver disease) వచ్చే చాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే లివర్ సిర్రోసిస్(Liver cirrhosis) వంటి వ్యాధలు, ఎన్నో రకాల క్యాన్సర్లు వస్తాయి.

కాలయమే కాదు.. లంగ్స్(Lungs), గుండె(heart) ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. మానసిక ఆరోగ్య సమస్య(mental health problem)లు, చికాకు(irritation) పెరిగిపోవడం, నోటి క్యాన్సర్(Oral cancer), గొంతు క్యాన్సర్(throat cancer), అన్నవాహిక(Esophagus), కాలేయ క్యాన్సర్(Liver cancer), పెద్ద పేగు క్యాన్సర్(Colon cancer)వంటి సమస్యలు తలెత్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా మద్యం లిమిట్ లో తీసుకోవాలని సూచిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Tags:    

Similar News