2025 New Year: ఆల్కహాల్‌ కంటే ఎక్కువ ఫీల్ ఇచ్చే ఫ్యాన్సీ డ్రింక్స్ ఇవే..

పార్టీలు, పబ్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఆల్కహాల్. బాధొచ్చినా, సంతోషమొచ్చినా.. ఫ్రెండ్స్ కలిసినా.. ఇంటికి బంధువులొచ్చినా మద్యం తాగుతుంటారు.

Update: 2024-12-31 15:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్టీలు, పబ్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఆల్కహాల్. బాధొచ్చినా, సంతోషమొచ్చినా.. ఫ్రెండ్స్ కలిసినా.. ఇంటికి బంధువులొచ్చినా మద్యం తాగుతుంటారు. అన్ని సందర్భాల్లోనూ ఆల్కహాల్ సేవించి.. ఇక కొత్త సంవత్సరం వేళ ఊరుకుంటారా? అస్సలు చాన్సే లేదనుకోండి. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా మద్యం తాగలేకపోవచ్చు. కాగా మద్యం ఫీల్‌నే తెప్పించే ఫ్యాన్సీ డ్రింక్స్ న్యూయర్ వేళ ఓసారి ట్రై చేయండి. అనారోగ్యకరమైన, అపరిశుభ్రమైన పదార్థాల్ని వాడకుండా రెడీ చేసిన ఈ ఆల్కహాల్ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

జాజికాయ కాఫీ రెసిపీ..

ఇందుకోసం నాలుగు టేబుల్ స్ఫూన్ల కాఫీ పౌడర్, ఒక చిన్న దాల్చిన చెక్క, చిటికెడు జాజికాయ పొడి, ఖర్జూరాలు, నారింజ తొక్క, లవంగాలు తీసుకోవాలి.

తయారీ విధానం..

ముందుగా లవంగాలు,జాజికాయ, నారింజ తొక్క, దాల్చిన చెక్కను కాఫీ పొడితో పాటు వాటర్ లో వేసి బాగా మరిగించి.. తర్వాత ఖర్జూరాల్ని గింజలు తీసి మెత్తగా చేసి అందులో వేయండి. ఇప్పుడు స్ఫూన్ తో ఈ మిశ్రమాన్ని అంతా కలిపి ఐదు నిమిషాలు ఉడకబెట్టండి. అంతే జాజికాయ కాఫీ రెసిపీ తయారైనట్లే. ఆల్కహాల్ కంటే అదనపు రుచిని ఇవ్వడమే కాకుండా.. ఈ కాఫీని తాగడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. డయాబెటిక్ రోగులు కూడా ఈ డ్రింక్ తాగొచ్చని నిపుణులు చెబుతున్నారు.

దానిమ్మ కొత్తిమీర జ్యూస్..

ఈ జ్యూస్ కోసం ముందుగా దాల్చిన చెక్క, రోజ్మేరీ, కొత్తిమీర, నారింజ ముక్కలు మరిగించి.. తర్వాత వడగట్టాలి. ఇక ధనియాలతో గార్నిష్ చేసి ఈ పానియాన్ని ఆస్వాదించడమే.

స్ట్రాబెర్రీ- జామ స్మూతీ

మూడు స్ట్రాబెర్రీలు రెండు కప్పుల వాటర్ తీసుకుని.. ఇందులో తేనెను యాడ్ చేయాలి. ఇది స్ట్రాబెర్రీలు మెత్తగా అయ్యేవరకు ఉడకబెట్టి.. పది నిమిషాలయ్యాక తీయ్యండి. చల్లారక ఈ మిశ్రమాన్ని చిన్న గ్లాసులోకి తీసుకోండి. దీనిలో కాస్త నిమ్మరసం యాడ్ చేయండి. అలాగే కొన్ని ఐస్ ముక్కలు కూడా జోడించుకోవచ్చు.

యాపిల్ - లవంగం మిశ్రమం..

దాల్చిన చెక్క ఒకటి, 200 మిల్లీ లీటర్ల యాపిల్ జ్యూస్, నారింజ తొక్క-1, నాలుగు నుంచి 6 నల్ల మిరియాలు తీసుకోండి. వీటితో పాటుగా రెండు లవంగాలు, వన్ టీస్ఫూన్ తేనె, అల్లం ముక్కలు తీసుకోండి.

తయారీ విధానం చూసినట్లైతే.. ముందుగా యాపిల్ రసాన్ని హాట్ వాటర్‌లో పోసి మసాలా దినుసులు, నారింజ, అల్లం, తేనె వేసి బాగా మరిగించండి. తర్వాత గ్లాసులోకి తీసుకుని చల్లారినాక తాగండి.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Tags:    

Similar News