LICలో ఏ పాలసీ మంచిదో తెలుసా..? ఆ బీమాతో బెనిఫిట్స్ ఎక్కువేనట!
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) అనేక పెట్టుబడి అవకాశాలను అందిస్తుంది. LIC లో పెట్టుబడి పెట్టడం వలన భవిష్యత్తులో మంచి రాబడి పొందొచ్చు. LIC దేశంలోని ఎంతో మంది పాలసీదారులకు ఎన్నో పాలసీలను అందిస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా రకాల జీవిత బీమా పాలసీలను అందిస్తోంది. ఈ మధ్యకాలంలో “LIC బీమా జ్యోతి పాలసీ” ఎక్కువగా ఆదరణ పొందుతుంది. చాలా ఫిక్స్‌డ్ […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) అనేక పెట్టుబడి అవకాశాలను అందిస్తుంది. LIC లో పెట్టుబడి పెట్టడం వలన భవిష్యత్తులో మంచి రాబడి పొందొచ్చు. LIC దేశంలోని ఎంతో మంది పాలసీదారులకు ఎన్నో పాలసీలను అందిస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా రకాల జీవిత బీమా పాలసీలను అందిస్తోంది.
ఈ మధ్యకాలంలో “LIC బీమా జ్యోతి పాలసీ” ఎక్కువగా ఆదరణ పొందుతుంది. చాలా ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లతో పోలిస్తే ఈ పథకంలో మంచి రాబడి వస్తుంది.
బీమా జ్యోతి పాలసీలో ఎలా చేరాలి..
1.పాలసీలో చేరడానికి కనీస వయస్సు 90 రోజులు కాగా గరిష్ట వయస్సు 60 సంవత్సరాలు.
2.పాలసీలో కనీసం రూ.లక్ష పెట్టుబడి పెట్టాలి.
3.పాలసీ వ్యవధి 15 నుండి 20 సంవత్సరాలు. ప్రీమియం చెల్లింపు వ్యవధి పాలసీ టర్మ్ కంటే 5 సంవత్సరాలు తక్కువగా ఉంటుంది.
4.బీమా జ్యోతి ప్లాన్‌లో ముఖ్యమైన డెత్ బెనిఫిట్ ఉంది. పాలసీదారు మరణించిన తరువాత పాలసీదారు నామినీకి హామీ ఇవ్వబడిన మొత్తాన్ని అందిస్తారు.
ఎల్‌ఐసి బీమా జ్యోతి పాలసీలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నవారు అధికారిక LIC వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా మీ దగ్గరలోని LIC శాఖను సంప్రదించవచ్చు.