వెట్టి నుంచి కార్మికులకు విముక్తి

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఒడిశాకు చెందిన కూలీలతో వెట్టి చాకిరి చేయిస్తున్న ఇటుకబట్టీల యాజమానులపై కేసు నమోదు చేసి బాధితులకు కోర్టు విముక్తి కల్పించింది. ఒడిశా నుంచి వచ్చిన బాధితుల తరుఫు బంధువు పోన్ కాల్‌ను సుమోటో కేసుగా కోర్టు స్వీకరించింది. దీంతో 35 మందికి వెట్టి చాకిరి నుంచి విముక్తి కలిగింది.. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే…కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం ఉగ్ర వాయి, భవాని పేట గ్రామాల్లో ఇటుక […]

Update: 2020-11-28 07:29 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఒడిశాకు చెందిన కూలీలతో వెట్టి చాకిరి చేయిస్తున్న ఇటుకబట్టీల యాజమానులపై కేసు నమోదు చేసి బాధితులకు కోర్టు విముక్తి కల్పించింది. ఒడిశా నుంచి వచ్చిన బాధితుల తరుఫు బంధువు పోన్ కాల్‌ను సుమోటో కేసుగా కోర్టు స్వీకరించింది. దీంతో 35 మందికి వెట్టి చాకిరి నుంచి విముక్తి కలిగింది.. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే…కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం ఉగ్ర వాయి, భవాని పేట గ్రామాల్లో ఇటుక బట్టిల్లో 35 మంది ఒడిశా కార్మికులు వెట్టి చాకిరి చేస్తున్నారు.

వారిని ఉగ్రవాయి, భవాని పేట గ్రామాల్లో ఇటుక బట్టి యజమానులు అంజన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు ఇబ్బందులు పెడుతున్నారని ఒడిశా నుండి వచ్చిన కార్మికుల బంధువు ఒకరు నిజామబాద్ జిల్లా కోర్టుకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. కాగా ఆ సమాచారాన్ని సుమోటోగా స్వీకరించి కేసును కోర్టు నమోదు చేసింది. జిల్లా న్యాయమూర్తి అదేశాల మేరకు కామారెడ్డి జిల్లా అదనపు న్యాయమూర్తి బి సత్తయ్య ,అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ప్రభుదాస్, కామారెడ్డి లేబర్ అధికారి సలాం, కామారెడ్డి రూరల్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, దేవునిపల్లి ఎస్సై జ్యోతిలతో కలిసి ఉగ్రవాయి, భవానీ పేట్ గ్రామాల్లోని ఇటుక బట్టిలను సంధర్శించారు. ఇటుక బట్టిల్లోని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

వారిని యజమానులు కొడుతూ తిడుతూ ఎలాంటి భోజన, వసతులు కల్పించడం లేదని, జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని తెలుపడంతో వారిపై అగ్రహం వ్యక్తం చేశారు. యజామానులపై సుమోటోగా కేసు నమోదు చేసినట్లు జిల్లా అదనపు న్యాయమూర్తి బి.సత్తయ్య తెలిపారు. వారిని వాహనాల్లో సొంత రాష్ట్రాలకు పంపినట్టు అదనపు న్యాయమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో కోర్టు లైజన్ ఆఫీసర్ కాంతయ్య , కోర్టు సిబ్బంది విక్రమ్ కుమార్, శ్రీధర్ ,రాజ్ కుమార్, రాజేందర్ పాల్గొన్నారు.

Tags:    

Similar News