లూయిస్ హామిల్టన్‌కు కరోనా పాజిటివ్
దిశ, స్పోర్ట్స్ : ఏడు సార్లు గ్రాండ్ ప్రీ గెలిచిన మేటి డ్రైవర్ లూయిస్ హామిల్టన్ కరోనా బారిన పడినట్లు మెర్సిడెజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వారాంతంలో బహ్రెయిన్‌లో జరుగనున్న సాఖిర్ గ్రాండ్ ప్రీలో ది మెర్సిడెజ్-ఏఎంజీ పెట్రొనాస్ ఎఫ్1 టీమ్ తరపున హామిల్టన్ రేసులో పాల్గొనాల్సి ఉన్నది. అయితే సోమవారం హామిల్టన్‌లో స్వల్ప కరోనా లక్షణాలు కనపడటంతో అతడికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో అతడు కోవిడ్ – 19 పాజిటివ్ అని తేలింది. […]
దిశ, స్పోర్ట్స్ : ఏడు సార్లు గ్రాండ్ ప్రీ గెలిచిన మేటి డ్రైవర్ లూయిస్ హామిల్టన్ కరోనా బారిన పడినట్లు మెర్సిడెజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వారాంతంలో బహ్రెయిన్‌లో జరుగనున్న సాఖిర్ గ్రాండ్ ప్రీలో ది మెర్సిడెజ్-ఏఎంజీ పెట్రొనాస్ ఎఫ్1 టీమ్ తరపున హామిల్టన్ రేసులో పాల్గొనాల్సి ఉన్నది. అయితే సోమవారం హామిల్టన్‌లో స్వల్ప కరోనా లక్షణాలు కనపడటంతో అతడికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో అతడు కోవిడ్ – 19 పాజిటివ్ అని తేలింది. దీంతో అతడు ఐసోలేషన్‌కు వెళ్లిపోయాడు. గత వారమే హామిల్టన్ మూడు కరోనా టెస్టులు చేయించుకున్నాడు.
అన్నింటిలోనూ అతడికి నెగెటివ్ ఫలితమే వచ్చింది. ఆదివారం చేసిన పరీక్షలో కూడా నెగెటివ్ వచ్చింది కానీ సోమవారం ఉదయం నుంచి కరోనా లక్షణాలు బయటపడినట్లు అతడి టీమ్ యాజమాన్యం తెలిపింది. హామిల్టన్ లేకపోవడం మెర్సిడెజ్ జట్టుకు పెద్ద లోటనే చెప్పాలి. ఒకటి రెండు రోజుల్లో హామిల్టన్ స్థానంలో ఎవరిని రేసులో దించుతామనే విషయాన్ని ప్రకటిస్తామని మెర్సిడెజ్ తెలిపింది.