గవర్నర్‌కు కాంగ్రెస్ నేత శ్రవణ్ లేఖ

దిశ, తెలంగాణ బ్యూరో: గవర్నర్‌ తమిళిసై ప్రతిపక్షాల పక్షాన నిలబడి, ప్రజా సమస్యలను తెలుసుకుని స్పందించాలని కాంగ్రెస్‌ నేత దాసోజు శ్రావణ్‌కుమార్‌ అన్నారు. కోట్లాది మంది రైతుల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా కలిసి వినతి పత్రాన్నిసమర్పిస్తామన్నా గవర్నర్‌ స్పందించక పోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం ఆయన గవర్నర్‌కు లేఖ రాశారు. ప్రజా సమస్యలపై గవర్నర్‌ను కలుస్తామని అడిగితే కరోనా పేరు చెప్పి కలిసేందుకు నిరాకరించారని, కానీ గవర్నర్‌ భర్త సౌందరరాజన్‌కు ద్రోణాచార్య అవార్డు వచ్చినందుకు […]

Update: 2020-10-04 09:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గవర్నర్‌ తమిళిసై ప్రతిపక్షాల పక్షాన నిలబడి, ప్రజా సమస్యలను తెలుసుకుని స్పందించాలని కాంగ్రెస్‌ నేత దాసోజు శ్రావణ్‌కుమార్‌ అన్నారు. కోట్లాది మంది రైతుల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా కలిసి వినతి పత్రాన్నిసమర్పిస్తామన్నా గవర్నర్‌ స్పందించక పోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం ఆయన గవర్నర్‌కు లేఖ రాశారు. ప్రజా సమస్యలపై గవర్నర్‌ను కలుస్తామని అడిగితే కరోనా పేరు చెప్పి కలిసేందుకు నిరాకరించారని, కానీ గవర్నర్‌ భర్త సౌందరరాజన్‌కు ద్రోణాచార్య అవార్డు వచ్చినందుకు సీఎం కేసీఆర్‌ నేరుగా రాజ్‌భవన్‌కు వచ్చి ఆయనకు సన్మానం చేశారన్నారు. గవర్నర్‌ కుటుంబంతో కలిసి ఫోటోలు దిగారని, మరి అప్పుడు కరోనా విషయం గుర్తుకు రాకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. సామాజిక దూరం పాటించకుండా ఫోటోలు దిగినా, సన్మానం చేసుకున్నా రాని కరోనా… రైతుల పక్షాన ఒకరిద్దరు నేతలు వచ్చి వినతి పత్రం ఇస్తే వస్తుందా అని ప్రశ్నించారు.

Tags:    

Similar News