గొర్రె పిల్లను తింటూ కనిపించిన చిరుత.. ఎక్కడంటే?
దిశ, వెబ్‌డెస్క్ : అడవిలో పులి సంచారం ఆనవాళ్లు కనుగొనేందుకు ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చిరుతపులి కనిపించింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలోని కడెం అటవీ ప్రాంతంలో మంగళవారం వెలుగుచూసింది. కడెం ప్రాజెక్టు ఎడమ కాలువ సమీపంలో గొర్రెల మందపై దాడి చేసి ఓ గొర్రెను చంపిన చిరుత దానిని అడవిలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. చిరుత సంచారంతో అలర్ట్ అయిన ఫారెస్టు అధికారులు కడెం ప్రాంత […]
దిశ, వెబ్‌డెస్క్ : అడవిలో పులి సంచారం ఆనవాళ్లు కనుగొనేందుకు ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చిరుతపులి కనిపించింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలోని కడెం అటవీ ప్రాంతంలో మంగళవారం వెలుగుచూసింది. కడెం ప్రాజెక్టు ఎడమ కాలువ సమీపంలో గొర్రెల మందపై దాడి చేసి ఓ గొర్రెను చంపిన చిరుత దానిని అడవిలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. చిరుత సంచారంతో అలర్ట్ అయిన ఫారెస్టు అధికారులు కడెం ప్రాంత వాసులకు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని రోజుల పాటు ఎవరూ అడవిలోకి పశువులను తీసుకుని వెళ్లొ్ద్దని ఆదేశించారు.