కరీంనగర్‌లో కలకలం రేపిన చిరుత పులి సంచారం

దిశ, కరీంనగర్ సిటీ: కరీంనగర్‌ జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. చిరుత సంచారం అంటూ వస్తోన్న పుకార్లు స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. సోమవారం రాత్రి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పలుచోట్ల చిరుత సంచరిస్తోందంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో సంచరిస్తోందంటూ పుకార్లు పెద్ద ఎత్తున సాగాయి. కాదు.. కాదు.. ఎలుగుబంటి వచ్చిందంటూ మరికొందరు ప్రచారం‌ చేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు వ్యవసాయ మార్కెట్ […]

Update: 2021-10-18 11:57 GMT
Leopard
  • whatsapp icon

దిశ, కరీంనగర్ సిటీ: కరీంనగర్‌ జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. చిరుత సంచారం అంటూ వస్తోన్న పుకార్లు స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. సోమవారం రాత్రి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పలుచోట్ల చిరుత సంచరిస్తోందంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో సంచరిస్తోందంటూ పుకార్లు పెద్ద ఎత్తున సాగాయి. కాదు.. కాదు.. ఎలుగుబంటి వచ్చిందంటూ మరికొందరు ప్రచారం‌ చేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు వ్యవసాయ మార్కెట్ ఆవరణను పరిశీలిస్తున్న ఫారెస్ట్, పోలీసులు అధికారులు, చిరుత కోసం గాలింపు ముమ్మరం చేశారు.

Tags:    

Similar News