వైద్యం అందించడంలో అలసత్వం తగదు

ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు వైద్యం అందించడంలో అలసత్వం ప్రదర్శించవద్దని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు.

Update: 2025-03-17 12:46 GMT
వైద్యం అందించడంలో అలసత్వం తగదు
  • whatsapp icon

దిశ, వేములవాడ : ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు వైద్యం అందించడంలో అలసత్వం ప్రదర్శించవద్దని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. సోమవారం వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రి లోని అన్ని విభాగాలను, రోగులకు సేవలు అందిస్తున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రతి విభాగాన్ని కలియ తిరిగి వైద్యులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్న తీరుని పర్యవేక్షించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు.

    రిజిస్టర్లు, ఔట్ పేషెంట్, ఐపీ వార్డు, పిడియాట్రిక్ వార్డు, ల్యాబ్, ఫార్మసీ, ఐసీయూ, డయాలసిస్ విభాగాలను పరిశీలించి మీ సమస్య ఏమిటి ? ఎక్కడి నుండి వచ్చారు? ఏ విధంగా వైద్య సేవలు అందిస్తున్నారు అనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి భవన నమూనాలో పేర్కొన్న విధంగా వార్డులు, గదులను సక్రమంగా వినియోగించాలని సూచించారు. పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. తనిఖీలలో ఆయన వెంట ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ పెంచలయ్య, వైద్య సిబ్బంది, అధికారులు తదితరులు ఉన్నారు.  


Similar News