మహిళా రైతులకు వ్యవసాయ పనిముట్లు
వ్యవసాయ యాంత్రీకరణ ఉప పథకం (ఎస్ఎంఏఎం) కింద రైతులకు 50శాతం రాయితీపై వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు అందించేందుకు మహిళా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తునట్లు మండల వ్యవసాయ అధికారి వైదేహి రాయ్ మంగళవారం తెలిపారు.

దిశ,సైదాపూర్ : వ్యవసాయ యాంత్రీకరణ ఉప పథకం (ఎస్ఎంఏఎం) కింద రైతులకు 50శాతం రాయితీపై వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు అందించేందుకు మహిళా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తునట్లు మండల వ్యవసాయ అధికారి వైదేహి రాయ్ మంగళవారం తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 50 శాతం సబ్సిడీపై ఇచ్చేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలు వచ్చాయన్నారు. మండలానికి బ్యాటరీ స్ప్రేయర్స్-07, పవర్ స్ప్రేయర్స్ 06, రోటావేటర్స్ 04 , (డిస్క్ హార్రోస్ ,కల్టివేటర్స్, ఎంబి ప్లవ్ ,కేజ్ వీల్స్) 05 తదితర పనిముట్లు రాయితీపై ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆసక్తి, అర్హత గల రైతులు వెంటనే దరఖాస్తుతో పాటు ఫొటో, కొత్త పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ జిరాక్స్, ట్రాక్టర్ తో పని చేసే యంత్రాలకు ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ పత్రాలు జతచేసి మండల వ్యవసాయ కార్యాలయంలో అందజేయాలని కోరారు. ఆసక్తి గల మహిళా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.