మిషన్ భగీరథ నీరు కలుషితం.. చర్మ వ్యాధులతో ప్రజలు అవస్థలు
ఎల్లారెడ్దిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎనిమిదవ వార్డులో మిషన్ భగీరథ నీరు గత వారం రోజులుగా పూర్తిగా కలుషితమై వస్తున్నాయి.

దిశ,ఎల్లారెడ్దిపేట : ఎల్లారెడ్దిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎనిమిదవ వార్డులో మిషన్ భగీరథ నీరు గత వారం రోజులుగా పూర్తిగా కలుషితమై వస్తున్నాయి. దాంతో వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నీరు కనీసం వంటపాత్రలు శుభ్రం చేసుకోవడానికి కానీ, స్నానాలకు కానీ పనికి రావడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మురుగు నీరు ఇతర అవసరాలకు ఉపయోగించడంతో ఒళ్లంతా దురద వస్తుందని పేర్కొంటున్నారు. విషయాన్ని సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మిషన్ భగీరథ అధికారులు, గ్రామపంచాయతీ అధికారులు స్పందించి స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీటిని అందించాలని కోరుతున్నారు.