విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి
హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కామన్ డైట్ మెనూ ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.

దిశ, తిమ్మాపూర్ : హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కామన్ డైట్ మెనూ ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. తిమ్మాపూర్ లోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి శనివారం రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్లో వసతులను, సౌకర్యాలను పరిశీలించారు. వంటగదిని, సరుకుల స్టోరేజీ గదిని తనిఖీ చేశారు. సరుకులను వాటి బ్రాండ్ ను, నాణ్యతను, గడువు తేదీని పరిశీలించారు. వంట గదిలో శుభ్రత పాటించాలని, పరిశుభ్రత, నాణ్యతతో భోజనం తయారు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కామన్ డైట్ మెనూ ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. నిర్దేశించిన కంపెనీలకు చెందిన స్టాక్ ను మాత్రమే వినియోగించాలని కోరారు. ఈ సందర్భంగా బాలికలతో పాటు భోజనం చేశారు. భోజనం రుచి, నాణ్యతను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ ఏ సమయానికి ఏయే ఆహారం ఇస్తున్నారని విద్యార్థులను అడిగారు. కామన్ డైట్ మెనూ ప్రకారం విద్యార్థులకు అన్ని రకాల పోషకాహారంతో కూడిన ఆహారాన్ని అందజేస్తున్నారని తెలిపారు. వివిధ రకాల విటమిన్ల, ప్రోటీన్లతో కూడిన ఈ ఆహారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలని కోరారు.