మా కాలనీలో తాగు నీరు రాక ఎన్ని రోజులో..

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం 9వ వార్డు కాలనీలో ప్రజలు మంచినీటి సమస్య పరిష్కరించాలని ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.

Update: 2025-03-21 10:30 GMT
మా కాలనీలో తాగు నీరు రాక ఎన్ని రోజులో..
  • whatsapp icon

దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం 9వ వార్డు కాలనీలో ప్రజలు మంచినీటి సమస్య పరిష్కరించాలని ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. 9వ వార్డులో నీటి సమస్యతో బాధపడుతున్నామని, కాలనీలో బోరు చెడిపోయి చాలా రోజులు అవుతున్నా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని పలు వార్డులలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని తెలిపారు. మురుగు కాలువలు కూడా తీయడం లేదని, దాంతో సాయంత్రం దోమలు ఇండ్లలోకి వస్తున్నాయని పేర్కొన్నారు. మిషన్ భగీరథ నీళ్లు ఎప్పుడో ఒకసారి ఐదు బిందెల కన్నా ఎక్కువ రావడం లేదన్నారు.  


Similar News