రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు.

Update: 2025-03-24 09:06 GMT
రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..
  • whatsapp icon

దిశ, వేములవాడ : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం స్వామివారికి అత్యంత ఇష్టమైన రోజు కావడంతో రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారు. దీంతో దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు.


Similar News