నల్లమలలో చిరుత మిస్టరీ.. చంపేశారా.. చనిపోయిందా..?
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ రిజర్వు టైగర్ అడవుల్లో చిరుత పులిని గుర్తుతెలియని దుండగులు చంపినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆసియా ఖండంలోని అతిపెద్ద రిజర్వు టైగర్ అటవీ ప్రాంతం అమ్రాబాద్ రిజర్వు టైగర్ పిలుస్తారు. ఈ అడవుల్లో పెద్ద పులుల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తాయి. ఈ నేపథ్యంలో చిరుత పులిని గుర్తుతెలియని దుండగులు చంపినట్లుగా […]
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ రిజర్వు టైగర్ అడవుల్లో చిరుత పులిని గుర్తుతెలియని దుండగులు చంపినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆసియా ఖండంలోని అతిపెద్ద రిజర్వు టైగర్ అటవీ ప్రాంతం అమ్రాబాద్ రిజర్వు టైగర్ పిలుస్తారు. ఈ అడవుల్లో పెద్ద పులుల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తాయి. ఈ నేపథ్యంలో చిరుత పులిని గుర్తుతెలియని దుండగులు చంపినట్లుగా అటవీశాఖ అధికారులకు ఉప్పందినట్లు సమాచారం.
చిరుత పులిని చంపేశారా.. అదుపులో అనుమానితులు..?
నవంబర్ 21న కొందరు వ్యక్తులు అమ్రాబాద్ రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలోని దోమలపెంట రేంజ్‌లో చిరుతపులి గోర్లను సేకరించినట్లు అటవీ శాఖ అధికారుల దృష్టికి వచ్చింది. వెంటనే సంబంధిత అధికారులు అంతర్గతంగా విచారణ చేపట్టారు. 15 రోజులపాటు చేసిన ఈ దర్యాప్తులో చిరుత పులిని చంపి కాల్చివేసినట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వారిని సైతం అనుమానితులుగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. వారంతా స్థానికులుగానే ప్రచారం జరుగుతోంది. మరోవైపు చిరుత పులిని చంపిన సంఘటన నల్లమలలో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో చిరుతపులి సహజంగానే మరణించిందా… లేక వేటగాళ్లు చంపేశారా అనేది తెలియాల్సి ఉంది.