ఎట్టకేలకు శివారులో చిక్కిన చిరుత

దిశ, వెబ్‌డెస్క్: గత ఐదునెలలుగా హైదరాబాద్ శివారు ప్రాంతాల ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్న చిరుత పులి ఎట్టకేలకు పట్టుబడింది. వలంతరిలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. దీనిని అధికారులు ఆదివారం ఉదయం గమనించారు. ఆవులను తినేందుకు వచ్చి బోనులో చిక్కినట్టు అధికారులు నిర్ధారించారు. అంతేగాకుండా శనివారం రెండు ఆవులపై దాడి చేయడంతో అవి మృత్యువాత పడ్డాయి. దీంతో చిరుత సంచారం గమనించిన అధికారులు ఆవుల చుట్టూ బోనులు ఏర్పాటు చేసి, పట్టుకున్నారు. […]

Update: 2020-10-10 21:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత ఐదునెలలుగా హైదరాబాద్ శివారు ప్రాంతాల ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్న చిరుత పులి ఎట్టకేలకు పట్టుబడింది. వలంతరిలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. దీనిని అధికారులు ఆదివారం ఉదయం గమనించారు. ఆవులను తినేందుకు వచ్చి బోనులో చిక్కినట్టు అధికారులు నిర్ధారించారు. అంతేగాకుండా శనివారం రెండు ఆవులపై దాడి చేయడంతో అవి మృత్యువాత పడ్డాయి. దీంతో చిరుత సంచారం గమనించిన అధికారులు ఆవుల చుట్టూ బోనులు ఏర్పాటు చేసి, పట్టుకున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆ చిరుతను జూపార్క్‌కు తరలించారు. దాదాపు ఐదు నెలలుగా ఆ చిరుత కోసం 10 బోన్లు, 30 ట్రాప్ కెమెరాలలో అధికారులు చిరుత కోసం గాలించారు.

Tags:    

Similar News