టీడీపీ అక్రమాలపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న మున్సిపల్, నెల్లూరు నగర కార్పొరేషన్, నగర పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం ఫిర్యాదు చేసింది. ఎస్ఈసీ నీలం సాహ్నికి వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకులు అధికారం దక్కించుకోవాలని కుట్రలకు తెరలేపారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. కుప్పంలో టీడీపీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నాని […]
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న మున్సిపల్, నెల్లూరు నగర కార్పొరేషన్, నగర పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం ఫిర్యాదు చేసింది. ఎస్ఈసీ నీలం సాహ్నికి వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకులు అధికారం దక్కించుకోవాలని కుట్రలకు తెరలేపారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు.
కుప్పంలో టీడీపీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నాని ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. కుప్పంలో నారా లోకేశ్ పర్యటించి న్యాయస్థానాల విలువలను దిగజార్చేలా మాట్లాడారని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కుప్పం వెళ్లాలని చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్ సిద్ధం చేసుకున్నారని, అసలు చంద్రబాబుకు కుప్పంలో ఓటు లేదని ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ అరాచకాలపై ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశామని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.