సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేయండి: వామపక్షాలు
దిశ, న్యూస్ బ్యూరో : అసెంబ్లీ సమావేశాల్లో సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ బిల్లులకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి, వర్గసభ్యులు జూలకంటి రంగారెడ్డిలు మాట్లాడుతూ.. సీఏఏను వ్యతిరేకిస్తున్నామని చెప్పడం కాకుండా వాటిని రాష్ట్రంలో అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. […]
దిశ, న్యూస్ బ్యూరో : అసెంబ్లీ సమావేశాల్లో సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ బిల్లులకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి, వర్గసభ్యులు జూలకంటి రంగారెడ్డిలు మాట్లాడుతూ.. సీఏఏను వ్యతిరేకిస్తున్నామని చెప్పడం కాకుండా వాటిని రాష్ట్రంలో అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. అనంతరం తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కోరారు. రాష్ట్రంలో జనగణన చేయడానికి సిద్ధమైన అధికారులే ఎన్‌పీఆర్‌లోని ఆంశాలను సేకరించనున్నారని తెలిపారు. వారికి ఎన్నార్సీ వివరాలు సేకరించవద్దని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
Tags: left parties, leaders, pocharam, Request letter, caa, nrc, npr