నేడు తెలంగాణ వ్యాప్తంగా వామపక్షాల నిరసన

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గురువారం వామపక్ష పార్టీలు ఆందోళనలు చేయనున్నాయి. దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ రాస్తారోకోలు చేయాలని నిర్ణయించాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని మండిపడ్డాయి. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువులు ధరలు పెంచడంతో పేదవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు రోజురోజుకు […]

Update: 2021-06-23 20:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గురువారం వామపక్ష పార్టీలు ఆందోళనలు చేయనున్నాయి. దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ రాస్తారోకోలు చేయాలని నిర్ణయించాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని మండిపడ్డాయి. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువులు ధరలు పెంచడంతో పేదవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు రోజురోజుకు తగ్గిపోతున్నాయని, అయినా.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేదని తెలిపారు.

Tags:    

Similar News