Free ambulance service: పేదల కోసం ఉచిత అంబులెన్స్ సర్వీస్ ప్రారంభం
దిశ,మంచిర్యాల: నస్ఫూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను స్మశానవాటికకు తరలించేందుకు ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సర్వీసును సోమవారం మున్సిపల్ చైర్మన్ ఈ సంపల్లి ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా రెండవ దశ ఉగ్రరూపం దాల్చడంతో కరోనా మృతదేహాలను తరలించేందుకు ఎవరు ముందుకు రావడం లేదు, అంబులెన్స్ ల కిరాయిలు అధికంగా ఉండడంతో పేదవారు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉచిత అంబులెన్స్ సర్వీసును ప్రారంభించమన్నారు. కరోనా […]
దిశ,మంచిర్యాల: నస్ఫూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను స్మశానవాటికకు తరలించేందుకు ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సర్వీసును సోమవారం మున్సిపల్ చైర్మన్ ఈ సంపల్లి ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా రెండవ దశ ఉగ్రరూపం దాల్చడంతో కరోనా మృతదేహాలను తరలించేందుకు ఎవరు ముందుకు రావడం లేదు, అంబులెన్స్ ల కిరాయిలు అధికంగా ఉండడంతో పేదవారు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉచిత అంబులెన్స్ సర్వీసును ప్రారంభించమన్నారు. కరోనా మృతదేహాలని స్మశానవాటికకు తరలించేందుకు ఉచిత అంబులెన్స్ సర్వీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, కౌన్సిలర్లు పద్మ, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.