అసెంబ్లీలో ఎమ్మెల్యేల నవ్వులు.. ఎందుకంటే..!

దిశ వెబ్‎డెస్క్: సాధారణంగా అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒక్కరినొక్కరూ విమర్శించుకుంటున్నారు. అప్పుడప్పుడూ ఒకరిపై ఒకరూ జోకులు వేసుకుంటూ నవ్వుతుంటారు. కాగా, తాజాగా జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ విపిన్ సింగ్ పర్మార్ కోవిడ్‎పై జోకులు వేసి నవ్వులు పూయించారు. సభ్యులందరూ గట్టిగా అరవొద్దు.. కరోనా వ్యాప్తి చెందుతోందని అసేసరికి ఎమ్మెల్యేలందరూ నవ్వారు. హిమాచల్ ప్రదేశ్‎ అసెంబ్లీలో సోమవారం ప్రతిపక్షనేత ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాల సందర్భంగా చర్చ జరిగింది. ఈ క్రమంలో […]

Update: 2020-09-08 05:44 GMT

దిశ వెబ్‎డెస్క్:

సాధారణంగా అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒక్కరినొక్కరూ విమర్శించుకుంటున్నారు. అప్పుడప్పుడూ ఒకరిపై ఒకరూ జోకులు వేసుకుంటూ నవ్వుతుంటారు. కాగా, తాజాగా జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ విపిన్ సింగ్ పర్మార్ కోవిడ్‎పై జోకులు వేసి నవ్వులు పూయించారు. సభ్యులందరూ గట్టిగా అరవొద్దు.. కరోనా వ్యాప్తి చెందుతోందని అసేసరికి ఎమ్మెల్యేలందరూ నవ్వారు. హిమాచల్ ప్రదేశ్‎ అసెంబ్లీలో సోమవారం ప్రతిపక్షనేత ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాల సందర్భంగా చర్చ జరిగింది.

ఈ క్రమంలో కొందరు ఎమ్మెల్యేలు గట్టిగా మాట్లాడారు. ఎమ్మెల్యేలు గట్టిగా మాట్లాడితే కరోనా వ్యాప్తికి అవకాశం ఉందని స్పీకర్ అన్నారు. ఎమ్మెల్యేందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పీకర్ కోరారు. సోమవారం అసెంబ్లీలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే రీటాదేవికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మిగతా సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News