సస్పెన్షన్ పై కోటంరెడ్డి ఏమన్నారంటే...!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేశారంటూ వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు.
దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేశారంటూ వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు. పార్టీ హైకమాండ్ నిర్ణయం వెలువరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై చర్యలు తీసుకున్న విధానం సరికాదని కోటంరెడ్డి అభిప్రాయపడ్డారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతమని ఆయన పేర్కొన్నారు. పార్టీ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే, మొదట షోకాజ్ నోటీసులు జారీ చేసిన అనంతరం తన వివరణ కోరాలని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో చర్యలు తీసుకోలేదన్న విషయం స్పష్టమైందని, పార్టీలో రాచరిక విధానం నడుస్తోందని కోటంరెడ్డి విమర్శించారు. ఏదేమైనా, పార్టీ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని ఆయన తెలిపారు.
Read more:
బ్రేకింగ్: స్క్రిప్ట్ తిరగరాశారు.. వైసీపీ రెబల్స్‌పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు