తెలంగాణ సెక్రటేరియట్ రోడ్డుపై నమాజ్‌లపై క్లారిటీ!
తెలంగాణలోని సెక్రటేరియట్ రోడ్డును కబ్జా చేసి అదే రోడ్డుపై నమాజ్‌లు చేస్తున్నారని, ఇలా చేస్తే తెలంగాణ భవిష్యత్ ఏంటని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని సెక్రటేరియట్ రోడ్డును కబ్జా చేసి అదే రోడ్డుపై నమాజ్‌లు చేస్తున్నారని, ఇలా చేస్తే తెలంగాణ భవిష్యత్ ఏంటని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. దీంతో ఈ ప్రచారంపై ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ రియాక్ట్ అయింది. ఈ ప్రచారం అంతా ఫేక్ అని దీనిని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈ ప్రచారం జరుగుతోందని నిజానికి 2021లో ఓ ధర్నా సందర్భంగా ఈ వీడియోను తీశారని స్పష్టం చేసింది. పాత వీడియోను 'తెలంగాణ సెక్రటేరియట్ రోడ్డు కబ్జా చేసి నమాజ్‌లు' అంటూ ప్రస్తుతం సర్క్యూలేట్ చేస్తున్నారని స్పష్టత ఇచ్చింది. ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరింది.
#MisleadingVideoAlert
— FactCheck_Telangana (@FactCheck_TS) April 20, 2023
ప్రజలను తప్పుదోవ పట్టించేలా 2021లో ఒక ధర్నాసందర్భంగా తీసిన వీడియో క్లిప్ వాడుతూ "తెలంగాణ సెక్రటేరియట్ రోడ్డు కబ్జా చేసి నమాజ్ లు" అన్నవీడియోను సర్క్యులేట్ చేస్తున్నారు.
అపోహలు సృష్టించే ఆస్కారం ఉన్నఇలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి. pic.twitter.com/OByCYEs8zu