బ్రెజిల్‌లో 28 లక్షలకు చేరువలో కేసులు
దిశ, వెబ్‌డెస్క్: బ్రెజిల్‌లో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 16,641 కరోనా కేసులు నమోదు కావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 27,50,318కు చేరింది. ఇక 561 మంది వైరస్ నుంచి కోలుకోలేక ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 94,665కు పెరిగింది. బ్రెజిల్‌లోని సావొపాలో రాష్ట్రం కరోనా హాట్ స్పాట్‌గా మారింది. ఎక్కువ జనాభా కల్గిన రాష్ట్రం కావడంతో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది. కేవలం సావొపాలోనే దాదాపు ఆరు లక్షల మంది కరోనా […]
దిశ, వెబ్‌డెస్క్: బ్రెజిల్‌లో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 16,641 కరోనా కేసులు నమోదు కావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 27,50,318కు చేరింది. ఇక 561 మంది వైరస్ నుంచి కోలుకోలేక ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 94,665కు పెరిగింది. బ్రెజిల్‌లోని సావొపాలో రాష్ట్రం కరోనా హాట్ స్పాట్‌గా మారింది. ఎక్కువ జనాభా కల్గిన రాష్ట్రం కావడంతో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది.
కేవలం సావొపాలోనే దాదాపు ఆరు లక్షల మంది కరోనా భారిన పడ్డారు. ఇక మరణాలు 23,365పైగా నమోదు అయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల జాబితాలో బ్రెజిల్ రెండో స్థానంలో ఉండగా..అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. తరువాతి స్థానాల్లో భారత్ , రష్యా, దక్షిణాఫ్రికా దేశాలు ఉన్నాయి.