ఆర్‌డీఓ వాహనాన్ని అడ్డుకున్న భూనిర్వాసితులు

దిశ చండూరు: కిష్ట రాయినిపల్లి జలాశయం పరిధిలో ముంపునకు గురవుతున్న లక్ష్మణా పురం, ఈదుల గండి గ్రామాల భూనిర్వాసితులతో ఈరోజు లక్ష్మణ పురంలో దేవరకొండ ఆర్‌డీఓ గోపీనాయక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. బలవంతంగా తమ భూములు లాక్కొని జలాశయం పనులు నిర్వహిస్తూ మాకు జీవనోపాదులు లేకుండా చేస్తున్నారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. పునరావాసం ప్యాకేజీ ఇచ్చిన తరువాతనే జలాశయం పనులు నిర్వహించాలని నిర్వాసితులు పేర్కొనడంతో అధికారులకు నిర్వాహకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మధ్యలోనే […]

Update: 2021-03-05 10:06 GMT

దిశ చండూరు: కిష్ట రాయినిపల్లి జలాశయం పరిధిలో ముంపునకు గురవుతున్న లక్ష్మణా పురం, ఈదుల గండి గ్రామాల భూనిర్వాసితులతో ఈరోజు లక్ష్మణ పురంలో దేవరకొండ ఆర్‌డీఓ గోపీనాయక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. బలవంతంగా తమ భూములు లాక్కొని జలాశయం పనులు నిర్వహిస్తూ మాకు జీవనోపాదులు లేకుండా చేస్తున్నారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు.

పునరావాసం ప్యాకేజీ ఇచ్చిన తరువాతనే జలాశయం పనులు నిర్వహించాలని నిర్వాసితులు పేర్కొనడంతో అధికారులకు నిర్వాహకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మధ్యలోనే ఆర్‌డీఓ గోపి రామ్ నాయక్ సమావేశం నుండి వెళ్లిపోవడంతో భూ నిర్వాసితులు కారును అడ్డగించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అక్కడి నుంచి పక్కకు పంపించి కారును పంపించివేశారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి తాసిల్దార్ లాల్ బహదూర్ శాస్త్రి, ఎస్సై రఫీ భూ నిర్వాసితులు పాల్గొన్నారు.

 

Tags:    

Similar News