రెచ్చిపోతున్న కబ్జా రాయుళ్లు.. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆక్రమణ
దిశ, కొత్తగూడెం: జిల్లా కేంద్రం అవ్వడంతో మున్సిపాలిటీ పరిధిలోని భూములకు రెక్కలొచ్చాయి. కష్టించి కట్టుకుంటే కూల్చేసి కబ్జాకు పాల్పడుతున్నారనేది ఓ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఆవేదన. స్థానిక ప్రజాప్రతినిధుల అండతో ఆరుగురు ఆడపిల్లల తండ్రిని ఇబ్బంది పెడుతున్నారు కబ్జా రాయుళ్లు. వందల మందికి విద్యాబుద్ధులు నేర్పిన హెడ్ మాస్టర్ ఇలాంటి దుస్థితిని ఎదుర్కొవడం విచారకరం. పెళ్లీడుకు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారని, మగ దిక్కు లేని తమ కుటుంబాన్ని ఇలా వేధించడం సరికాదంటున్నారు స్థానికులు. పోలీసులు, స్థానిక ప్రజా […]
దిశ, కొత్తగూడెం: జిల్లా కేంద్రం అవ్వడంతో మున్సిపాలిటీ పరిధిలోని భూములకు రెక్కలొచ్చాయి. కష్టించి కట్టుకుంటే కూల్చేసి కబ్జాకు పాల్పడుతున్నారనేది ఓ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఆవేదన. స్థానిక ప్రజాప్రతినిధుల అండతో ఆరుగురు ఆడపిల్లల తండ్రిని ఇబ్బంది పెడుతున్నారు కబ్జా రాయుళ్లు. వందల మందికి విద్యాబుద్ధులు నేర్పిన హెడ్ మాస్టర్ ఇలాంటి దుస్థితిని ఎదుర్కొవడం విచారకరం. పెళ్లీడుకు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారని, మగ దిక్కు లేని తమ కుటుంబాన్ని ఇలా వేధించడం సరికాదంటున్నారు స్థానికులు. పోలీసులు, స్థానిక ప్రజా ప్రతినిధుల అండదండలతో భూ ఆక్రమణ దారులు రెచ్చిపోతున్నారని ఆరోపిస్తున్నారు. ఆ రిటైర్డ్ హెడ్ మాస్టర్‌తో పాటు శ్రీధర్ రావు అనే హెడ్ మాస్టర్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో 1990లో స్థలం కొనుగోలు చేశారు. 2020లో రూమ్ కట్టి ఇంటి నెంబర్ తీసుకున్నారు. ఆ స్థలం ఆడ పిల్లల పెళ్లికి ఉపయోగపడుతుందనుకుంటే.. లక్ష్మణ్ అగర్వాల్ అనే వ్యక్తి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కట్టిన ఇల్లును ఎవరూ లేని సమయంలో కూల్చి తమ స్థలాన్ని దురాక్రమణ చేసేందుకు ప్రయత్నించారని బాధితులు వాపోతున్నారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, న్యాయం చేయాలని అధికారులను బాధితులు కోరుతున్నారు.