షో కోసం కెమెరా ముందు ఫైట్ చేయను : లక్ష్మీమీనన్
దిశ, వెబ్‌డెస్క్: ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన ‘కుంకీ’ చిత్రం ద్వారా తమిళ చిత్ర సీమకు హీరోయిన్‌గా పరిచయమైన లక్ష్మీమీనన్.. ‘సుందర పాండ్యన్ పాండ్యనాడు, కొంబన్’ తదితర చిత్రాల్లో నటించింది. అయితే తెలుగులో బిగ్ బాస్ నాలుగో సీజన్ ఇప్పటికే ప్రసారమవుతుండగా తమిళంలో త్వరలోనే ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ లక్ష్మీమీనన్ తమిళ బిగ్‌బాస్ కంటెస్టెంట్ అంటూ వార్తలు వినిపించాయి. కాగా ఈ వార్తలపై లక్ష్మీమీనన్ ఓ రేంజ్‌లో విరుచుకుపడింది. కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్న […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన ‘కుంకీ’ చిత్రం ద్వారా తమిళ చిత్ర సీమకు హీరోయిన్‌గా పరిచయమైన లక్ష్మీమీనన్.. ‘సుందర పాండ్యన్ పాండ్యనాడు, కొంబన్’ తదితర చిత్రాల్లో నటించింది. అయితే తెలుగులో బిగ్ బాస్ నాలుగో సీజన్ ఇప్పటికే ప్రసారమవుతుండగా తమిళంలో త్వరలోనే ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ లక్ష్మీమీనన్ తమిళ బిగ్‌బాస్ కంటెస్టెంట్ అంటూ వార్తలు వినిపించాయి. కాగా ఈ వార్తలపై లక్ష్మీమీనన్ ఓ రేంజ్‌లో విరుచుకుపడింది.
కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్న ‘బిగ్ బాస్ 4’ తమిళ్ షోలో కంటెస్టెంట్స్ దాదాపు ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తోంది. ఆ లిస్టులో కోలీవుడ్‌లో ఇప్పడిప్పుడే పాపులర్ అవుతున్న నటి లక్ష్మీ మీనన్ కూడా ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ విషయం కాస్తా లక్ష్మీ చెవిన పడటంతో ఆమె ఒక్కసారిగా సీరియస్ అయ్యింది. ‘నేను బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ చేయడం లేదు. నేను ఇతరులు తిన్న ప్లేట్స్‌ను కడగడం, టాయ్‌లెట్స్‌ను శుభ్రం చేసే పనులను ఇప్పటి వరకు చేయలేదు, చేయను కూడా. షో పేరుతో కెమెరాల ముందు ఫైటింగ్ చేయడం నాకు నచ్చదు. నేను ఈ పిట్ షోలో పాల్గొనను’ అన్నారు లక్ష్మీమీనన్. దాంతో పాటు ఈ షోలో పాల్గొనడం, కాదనుకోవడం.. అది తన చాయిస్ అని, ఈ విషయంపై ఇంకెవరూ మాట్లాడానికి రైట్ లేదన్నారు. ఇదంతా ఏదో అటెన్షన్ డ్రా చేయలని చేయలేదని, అంతేకాదు ఎవరినీ కించపరిచే ఉద్దేశం కూడా తనకు లేదని స్పష్టం చేసింది. నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, తాను బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్ చేయకపోవడానికి బలమైన కారణాలున్నాయని తెలిపింది.