ఉపాధి కూలీని మింగిన ఎండలు
దిశ, కరీంనగర్ : రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతోంది.దీనికి కారణం రోహిణి కార్తే ప్రభావమే అని వాతవరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.బయటకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని,వీలైతే గొడుగు వెంట బెట్టుకుని వెళ్లాలని సూచిస్తున్నారు.ఈ క్రమంలోనే ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళా కూలీ వడదెబ్బకు అక్కడికక్కడే మృతి చెందింది.ఈ ఘటన జిల్లాలోని చొప్పదండి మండలం ఆర్నకొండలో గురువారం చోటుచేసుకుంది.వివరాల్లోకివెళితే..కూలీ పనికి వెల్లిన వరికోలు నర్సమ్మ (48) వడదెబ్బ కారణంగా మరణించినట్లు స్థానికులు వెల్లడించారు. సమాచారం అందుకున్నస్థానిక ఎమ్మెల్యే […]
దిశ, కరీంనగర్ :
రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతోంది.దీనికి కారణం రోహిణి కార్తే ప్రభావమే అని వాతవరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.బయటకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని,వీలైతే గొడుగు వెంట బెట్టుకుని వెళ్లాలని సూచిస్తున్నారు.ఈ క్రమంలోనే ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళా కూలీ వడదెబ్బకు అక్కడికక్కడే మృతి చెందింది.ఈ ఘటన జిల్లాలోని చొప్పదండి మండలం ఆర్నకొండలో గురువారం చోటుచేసుకుంది.వివరాల్లోకివెళితే..కూలీ పనికి వెల్లిన వరికోలు నర్సమ్మ (48) వడదెబ్బ కారణంగా మరణించినట్లు స్థానికులు వెల్లడించారు. సమాచారం అందుకున్నస్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పని ప్రదేశానికి వెళ్లి మృతురాలి కుటుంబీకులను పరామర్శించారు.అనంతరం ఉపాధి పనులు జరుగుతున్న ప్రాంతాల్లో కూలీల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సంబంధింత అధికారులను ఆదేశించారు.