వరండాలో పెట్టిన అధికారులు.. వర్షానికి తడిసిన క్వశ్చన్ పేపర్స్

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: డిగ్రీ ప‌రీక్షల‌ ప్రశ్నాప‌త్రాల భ‌ద్రత‌ను కాక‌తీయ యూనివ‌ర్సిటీ ఎగ్జామ్ కంట్రోల్ అధికారులు వాన‌కు వ‌దిలేశారు. ప్రశ్నాప‌త్రాల‌ను ఎంతో జాగ్రత్తగా భ‌ద్ర ప‌ర‌చాల్సి ఉండ‌గా ప‌రీక్షల నియంత్రణ అధికారి కార్యాల‌యం వ‌రండాలో వాన‌కు త‌డుస్తూ క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. డిగ్రీ ప‌రీక్షల‌కు సంబంధించిన పేపర్లని తెలుస్తోంది. వరండాలో పెట్టిన వాటిపై ఏదో నామ‌మాత్రంగా సంచులు క‌ప్పారు. వినియోగించ‌ని సెట్లను మ‌రో విడ‌త వినియోగించేందుకు వీలు కూడా ఉంటుంద‌ని కేయూకు చెందిన అధికారులే చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. ఎంతో […]

Update: 2021-07-22 01:28 GMT

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: డిగ్రీ ప‌రీక్షల‌ ప్రశ్నాప‌త్రాల భ‌ద్రత‌ను కాక‌తీయ యూనివ‌ర్సిటీ ఎగ్జామ్ కంట్రోల్ అధికారులు వాన‌కు వ‌దిలేశారు. ప్రశ్నాప‌త్రాల‌ను ఎంతో జాగ్రత్తగా భ‌ద్ర ప‌ర‌చాల్సి ఉండ‌గా ప‌రీక్షల నియంత్రణ అధికారి కార్యాల‌యం వ‌రండాలో వాన‌కు త‌డుస్తూ క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. డిగ్రీ ప‌రీక్షల‌కు సంబంధించిన పేపర్లని తెలుస్తోంది. వరండాలో పెట్టిన వాటిపై ఏదో నామ‌మాత్రంగా సంచులు క‌ప్పారు. వినియోగించ‌ని సెట్లను మ‌రో విడ‌త వినియోగించేందుకు వీలు కూడా ఉంటుంద‌ని కేయూకు చెందిన అధికారులే చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. ఎంతో వ్యయంతో ముద్రించిన ప‌రీక్ష ప‌త్రాల‌ను మ‌రెంతో జాగ్రత్తగా భ‌ద్రప‌ర‌చాల్సింది పోయి ఇలా నిర్లక్ష్యం చేయడంతో కేయూ విద్యార్థుల నుంచి, విద్యార్థి సంఘాల నేత‌ల నుంచి విమ‌ర్శలు గుప్పిస్తున్నారు. కేయూలో అనేక బిల్డింగ్‌లు ఖాళీగా ఉన్నప్పటికీ ప‌రీక్ష ప‌త్రాల భ‌ద్రత‌పై కేయూ అధికారులు కేవ‌లం నిర్లక్ష్య ధోర‌ణిని ప్రద‌ర్శిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News