అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయండి

దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. తాండూర్, పరిగి, వికారాబాద్ మున్సిపాలిటీలపై సోమవారం మంత్రి అధికారులతో సమీక్షించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని మంత్రి కేటీఆర్ కోరారు. మూడు పట్టణాల్లో పార్కులు, ఫుట్‌పాత్‌, రోడ్లు, టాయిలెట్ల నిర్మాణం, స్మశాన వాటికల అభివృద్ధి పనులపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ […]

Update: 2020-06-15 09:38 GMT

దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. తాండూర్, పరిగి, వికారాబాద్ మున్సిపాలిటీలపై సోమవారం మంత్రి అధికారులతో సమీక్షించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని మంత్రి కేటీఆర్ కోరారు. మూడు పట్టణాల్లో పార్కులు, ఫుట్‌పాత్‌, రోడ్లు, టాయిలెట్ల నిర్మాణం, స్మశాన వాటికల అభివృద్ధి పనులపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆనంద్, రోహిత్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

Tags:    

Similar News