స్వయంగా కేటీఆరే అక్కడికి వెళ్లి ఆరా తీశారు.. కారణమేందో తెలిసిపోయింది

దిశ, కరీంనగర్: మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గమైన సిరిసిల్ల అభివృద్ధిలో దూసుకుపోతున్నప్పటికీ మల్కపేట్ రిజర్వాయర్ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. మినిస్టర్ కేటీఆర్ చొరవతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధుల వరద పారుతున్నదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, నీటి వరద పారించాల్సిన ప్రాజెక్టుపై మాత్రం ఎందుకు మంత్రి చిన్నచూపు చూస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఈ విషయమై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. దీంతో ఇటీవల మినిస్టర్ కేటీఆరే స్వయంగా ఆ ప్రాజెక్టు పనులు పరిశీలించారు. పనుల […]

Update: 2020-06-06 20:08 GMT

దిశ, కరీంనగర్: మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గమైన సిరిసిల్ల అభివృద్ధిలో దూసుకుపోతున్నప్పటికీ మల్కపేట్ రిజర్వాయర్ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. మినిస్టర్ కేటీఆర్ చొరవతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధుల వరద పారుతున్నదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, నీటి వరద పారించాల్సిన ప్రాజెక్టుపై మాత్రం ఎందుకు మంత్రి చిన్నచూపు చూస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఈ విషయమై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. దీంతో ఇటీవల మినిస్టర్ కేటీఆరే స్వయంగా ఆ ప్రాజెక్టు పనులు పరిశీలించారు. పనుల స్పీడ్ పెంచాలని ఆఫీసర్లను ఆదేశించారు.

సిరిసిల్లకు నీరందించే ప్రాజెక్టు..

ఏడు దశాబ్దాల సిరిసిల్ల చరిత్రలో సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు ఏనాడూ అధికార పార్టీకి చెందిన వారు కారు. ఈ కారణంగానే సిరిసిల్లలో అభివృద్ధి కుంటుపడిందన్న చర్చ మొన్నటి వరకు జరిగేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఇక్కడ్నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కేటీఆర్ మినిస్టర్‌గా కొనసాగుతున్నారు. దాంతో సిరిసిల్లలో గ్రామాల నుంచి పట్నం వరకు కేటీఆర్ మార్క్ డెవలప్‌మెంట్ కనిపిస్తోందని టీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు. దాదాపు రూ.800 కోట్లతో పనులు చేపట్టారనీ, కొన్ని పూర్తి కాగా, ఇంకొన్ని పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు. రహదారులు, రైల్వే రూట్లు, విద్య, వైద్య సదుపాయాలు కల్పించేందుకు కృషి జరుగుతున్నదని వివరిస్తున్నారు. ఇదంతా ఒకవైపు అయితే, మరో వైపు సిరిసిల్లకు తాగునీరందించే మల్కపేట రిజర్వాయర్ పనులు ఆగిపోయాయి. సాంకేతిక అడ్డంకుల వల్లే ఈ అనుసంధాన ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. మిడ్ మానేరు నుంచి 12 కిలోమీటర్ల మేర అండర్ టన్నెల్ ద్వారా నీటిని మల్కపేట రిజర్వాయర్‌కు తరలించాలని ఆఫీసర్లు నిర్ణయించారు. రిజర్వాయర్ సామర్థ్యాన్ని 3 టీఎంసీలకు పెంచారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఈ ప్యాకేజీలో భూసేకరణ కూడా పెండింగ్‌లో ఉంది.

అదనపు నిధులివ్వాలి..

మిడ్ మానేరు ప్రాజెక్టులోకి నీటిని తరలించడంతో పాటు సొరంగం పనులు జరుగుతున్న ప్రాంతంలోకి నీరు వచ్చి చేరింది. కొన్ని ప్రాంతాల్లో రూఫ్ పడిపోవడం కూడా పనులు నిలిచిపోవడానికి కారణం అయింది. వీటన్నింటిని అధిగమించేందుకు అదనంగా నిధులు కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే సమయంలో లాక్ డౌన్ రావడంతో కూలీల కొరత కూడా తీవ్రంగా ఏర్పడింది. దీంతో మల్కపేట రిజర్వాయర్ పనులు నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు పూర్తి కాలేదు. ఎత్తైన కొండపొచమ్మ సాగర్ వద్దకు తీసుకెళ్లడంలో సఫలం అయిన సర్కార్ మల్కపేట రిజర్వాయర్ విషయంలో సత్ఫలితాలు సాధించలేకపోయింది. సిరిసిల్ల నియోజకవర్గానికి అత్యంత కీలకమైన మల్కపేట రిజర్వాయర్ పనులు పూర్తికాకపోవడాన్ని అందిపుచ్చుకున్న ప్రతిపక్షాలు కేటీఆర్‌పై విమర్శలు చేయడం ప్రారంభించాయి. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని ఎత్తి చూపుతూ కేటీఆర్ వైఫల్యం అంటూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే, మినిస్టర్ కేటీఆర్ ఇప్పటికే ఈ మల్కపేట రిజర్వాయర్‌తో పాటు అండర్ టన్నెల్ పనులపై పలుమార్లు రివ్యూ చేశారు. అంతటితో ఆగకుండా క్షేత్రస్థాయి పర్యటనలూ చేశారు. దసరా నాటికి మల్కపేట రిజర్వాయర్‌లో నీరు వచ్చి చేరేవిధంగా కార్యచరణ రూపొందించాలనీ, పనుల స్పీడ్ పెంచాలని ఆఫీసర్లను ఆదేశించారు.

Tags:    

Similar News