పని చేయకపోతే పదవులు ఊడుతయ్ : కేటీఆర్

పరిపాలన సౌలభ్యం కోసమే రాష్ట్రం ఏర్పడిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో పంచాయతీ రాజ్ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ… 10 జిల్లాల తెలంగాణను 33జిల్లాలు ఏర్పాటు చేసుకున్నది పరిపాలనా సౌలభ్యం కోసమేనన్నారు. రాష్ట్రంలో 12751 గ్రామపంచాయతీ ఏర్పాటు చేయడం జరిగిందని‌ ప్రజలకు మెరుగైన ఫలాలు అందించాలన్పది ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు. అందుకే సంస్కరణలు చేయడం జరిగిందని, కొత్త పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాలను తీసుకురావడానికి కారణం కూడా ఇదేనన్నారు. అభివృద్ధి ఎలా చేస్తారని ప్రజలు […]

Update: 2020-02-20 07:00 GMT

పరిపాలన సౌలభ్యం కోసమే రాష్ట్రం ఏర్పడిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో పంచాయతీ రాజ్ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ… 10 జిల్లాల తెలంగాణను 33జిల్లాలు ఏర్పాటు చేసుకున్నది పరిపాలనా సౌలభ్యం కోసమేనన్నారు. రాష్ట్రంలో 12751 గ్రామపంచాయతీ ఏర్పాటు చేయడం జరిగిందని‌ ప్రజలకు మెరుగైన ఫలాలు అందించాలన్పది ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు. అందుకే సంస్కరణలు చేయడం జరిగిందని, కొత్త పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాలను తీసుకురావడానికి కారణం కూడా ఇదేనన్నారు. అభివృద్ధి ఎలా చేస్తారని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారన్నారు. కొత్త చట్టాలు కఠినంగా ఉన్నాయి. పని చేయక పోతే పదవులు పోతాయన్న విషయం గుర్తు పెట్టుకోవాలని కేటీఆర్ సూచించారు. ప్రజలు వద్దనుకున్నవారు ఇంటికి పోతారని, ప్రజాభివృద్ది చేసిన వారిని ప్రజలు గుర్తుంచుకుంటారని అన్నారు. పారిశుద్ధ్యం, పచ్చదనం పై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్రం దేశంలో ఏది లేదని, మీ గ్రామానికి మీరే కథానాయకులు అనుకుంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎవరి పదవైనా తీసేయాల్సి వస్తే ముందు టీఆర్ఎస్ వారి నుంచే మొదలు పెడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. సర్పంచ్‌లను తొలగించాల్సి వస్తే సీఎం సైతం కాపాడలేరన్న విషయం గుర్తు పెట్టుకోవాలని, యువతను, కుల సంఘాలను అన్ని వర్గాల వారిని పల్లె ప్రగతిలో భాగస్వామ్యం చేయాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను ఆపేసైనా గ్రామపంచాయతీలకు సీఎం నిధులిస్తున్నారంటే గ్రామాల అభివృద్ధిపై ఎలా కట్టుబడి ఉన్నామో అర్థం చేసుకోవాలని కేటీఆర్ అన్నారు. తాను కూడా గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తానని ప్రకటించారు. మర్చి నెలలో సీఎం కేసీఆర్ ఆకస్మిక పర్యటనలు ఉంటాయని వెల్లడించారు.

 

Tags:    

Similar News