నా రామ్ చరణ్ తెలుసా నీకు..?: కేటీఆర్.. వీడియో వైరల్
కేటీఆర్… ఆయనకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సామాజిక మాధ్యమాల్లో ఎదురైన సమస్య అయినా సరే… సమాజంలో ఎదుర్కొంటున్న సమస్య అయినా సరే…. తన దృష్టికి వస్తే ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తాడు రామన్న. ప్రస్తుత కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా ఏర్పడిన పరిస్థితులను సోషల్ మీడియా వేదికగా చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు కేటీఆర్. అయితే నేరుగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు బస్తీల్లోకి వెళ్లిన కేటీఆర్…. ఇంటి ముందు నిలుచున్న ఓ మహిళను లాక్ డౌన్ ఎలా […]
కేటీఆర్… ఆయనకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సామాజిక మాధ్యమాల్లో ఎదురైన సమస్య అయినా సరే… సమాజంలో ఎదుర్కొంటున్న సమస్య అయినా సరే…. తన దృష్టికి వస్తే ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తాడు రామన్న. ప్రస్తుత కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా ఏర్పడిన పరిస్థితులను సోషల్ మీడియా వేదికగా చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు కేటీఆర్. అయితే నేరుగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు బస్తీల్లోకి వెళ్లిన కేటీఆర్…. ఇంటి ముందు నిలుచున్న ఓ మహిళను లాక్ డౌన్ ఎలా ఉంది? అనే దాని గురించి ఆరా తీశాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళోద్దు అని… పిల్లలను కూడా ఇంటి పట్టునే ఉంచాలని సూచించారు. ఈ క్రమంలోనే ఆ మహిళ కొడుకు పేరు అడిగారు కేటీఆర్. దానికి సమాధానంగా రామ్ చరణ్ అని బదులిచ్చాడు బాబు. అప్పుడు కేటీఆర్ నా రామ్ చరణ్ తెలుసా నీకు? సినిమాల్లో రామ్ చరణ్ అని ప్రశ్నించగా … ఒకేసారి నవ్వులు విరిశాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా… అసలు రామ్ చరణ్ కు, రామన్నకు అంత స్నేహం ఉందా? అనే దానిపై ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఆరా తీస్తున్నారు. నా రామ్ చరణ్ అనేంత అనుబంధం ఎలా ఏర్పడిందని చర్చించుకుంటున్నారు.
#KTR interaction with people making awareness #StayHome till May3#lockdown pic.twitter.com/4nRze9umPp
— Sai kumar (@saikumar_8007) April 16, 2020
చెర్రీ, కేటీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని… అందుకే కేటీఆర్ చరణ్ ధృవ, వినయ విధేయ రామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హాజరయ్యాడని సోషల్ మీడియాలో చర్చలు జరుపుతున్నారు ఫ్యాన్స్. మరికొందరు కేటీఆర్ లీడర్ షిప్ క్వాలిటీస్, ప్రజలో మమేకమై వారికి భరోసా ఇచ్చే తీరును అభినందిస్తున్నారు.
Tags :KTR, Ram Charan, RC, Friendship, Friendship goals, CoronaVirus Covid19